Showing posts with label political news. Show all posts
Showing posts with label political news. Show all posts

Saturday, 16 April 2016

Vijay Mallya's business model could be at fault: Jaitley



SHINGTON: Questioning the "business model" of long-grounded Kingfisher Airlines for Vijay Mallya's mounting woes, Finance Minister Arun Jaitley has said the airline sector as such is doing well in India with many carriers making good profits.

Mallya, the owner of Kingfisher Airlines and many other companies that owe over Rs 9,000 crore of dues to lenders, is currently in London, defying Enforcement Directorate (ED) summons.

"I am not giving a final opinion on it. It could be attributed to the business model of a particular company," Jaitley yesterday said here in response to a question on Mallya, on which he refused to be directly dragged into.

"As far as the recoveries are concerned, in this (Mallya) case, banks are taking all possible steps. And whether there have been violations of some penal provisions, the investigating agencies are looking at it," he said.

A non-bailable warrant has been issued against Mallya after he refused to return to India to appear before the ED on three different occasions on investigations related to a money laundering case against him.

Jaitley's remarks came on a day when the External Affairs Ministry suspended Mallya's diplomatic for four weeks and threatened to revoke it if he fails to respond within a week on why his passport should not be impounded.

"I do not think it (Mallya's case) had anything to do with the government because a lot of his cases were also locked up in courts. When he was in India, I understand from the banking sector that almost every recovery, every step, was challenged in court.

"So he used the legal process till the date of his departure and then he had to abandon that," the minister said.

A member of Parliament, under the existing law, could lose his membership if one becomes an "adjudged insolvent", for which the bankruptcy law is necessary, he said.

"Generally, if you are not paying, that is different from the legal language in the constitution. There has to be a system under which you are adjudicated and judged as a declared insolvent and that only happens if you have an insolvency law in place. That's what the parliamentary committee is looking at not in his context but independent of that," he said, hoping that this case may help early passage of the law.

Responding to a question, Jaitley said the airlines sector in India is not suffering that much, unlike several other sectors like steel and power.

"If you look at other airline companies in India, most of them have turned around and are making (profits). Jet is now making profit. Indigo has made huge profits throughout. Spice Jet is making profits. Go Air is making profits," Jaitley said.

Jaitley said his own understanding of the NPA (non- performing asset) situation is that most of it is related to business failure in certain specific sectors of the industry.

"If you analyse the quantum of NPAs, they represent about five or six sectors - steel, power, somewhat in textiles, highways, infrastructure, there are a few of them in sugar. In addition to these there are individual companies that have done badly," he said.

Some loans might have been given without adequate due diligence principles, he acknowledged.

"Airlines problem is not sectoral, for the simple reason that most of the other airlines lasted the challenging period, turned around and are making profits. In steel, across the board sector was suffering, highways is a sector where everybody was suffering.

"These are all sectoral reasons, sectors where you have to address the sector, where the sector would revive and the bad loans become performing loans," he said.


Jaitley said banks and other investigating agencies would act independently and take their own decision.

"The banks have to take a prudent decision based on their banking. The government did not ask the banks to sanction the loan. The banks (even if it is a government-owned) would have to take a decision" based on their commercial considerations, he said in response to a question.


The Finance Minister is currently on a week-long tour of the US primarily to attend the annual Spring meeting of the International Monetary Fund and the World Bank.


Can't pay Rs 53,000 to rent 2,765 sqm house: Priyanka Gandhi



NEW DELHI: The late PM Rajiv Gandhi's and Congress president Sonia Gandhi's daughter Priyanka Gandhi Vadra proved to be a tough negotiator 14 years ago, getting the Vajpayee government to pare down the monthly rent to her sprawling 2,765.18 sqm house in Lutyens' Delhi from Rs 53,421 to a mere Rs 8,888. She said it was "beyond her capacity to pay the high amount".

At present, Priyanka pays Rs 31,300 for her type VI government accommodation at 35, Lodhi Estate. She and three other "private citizens", including former Punjab DGP KPS Gill, All India Anti-Terrorist Front chief M S Bitta and Punjab Kesari editor Ashwani Kumar, were provided accommodation by the government on security grounds. Gill and Bitta are believed to be paying around the same amount as Priyanka while Kumar vacated his house in 2012.

Priyanka wrote to the government in May 7, 2002 that Rs 53,421 was "too high" an amount and "beyond her paying capacity". She informed the government that she had been "occupying the bungalow on the request of the SPG and that a large part of the bungalow was occupied by SPG itself" and not by her family. She said she was staying in a general pool house not out of choice or voluntarily but because of security considerations. She requested that she may "continue to pay rent at the earlier rate of Rs 28,451 per month, instead of the increased rate of Rs 53,421 per month", according to file notings from the ministry of urban development's directorate of estates. Other protectees also raised similar concerns.

In fact, the four people continued to pay the old rate despite the increase in rent, with Priyanka notching up outstanding dues of Rs 3.76 lakh up to January 31, 2004. 

The note for the Cabinet Committee on Accommodation on July 8, 2003 - accessed under RTI by Noida resident Dev Ashish Bhattacharya - reasoned that "the matter has been reviewed keeping in view the facts that security protectees are not unauthorised occupants and allotments have been made to them as per policy of the government. It has been felt that the security protectees, including SPG protectees, may be charged special licence fee in respect of the government accommodation provided to them as they are private persons and they cannot afford to pay the market rates of licence fees".


The special licence fee was revised to Rs 8,888 per month from July 24, 2003, for Priyanka, and the rent for other protectees also brought down. In case of Gill, it was brought down from Rs 60,741 to Rs 10,715, for Bitta from Rs 55,536 to Rs 10,203, and for Kumar from Rs 50,311 to Rs 8,555.

The house was allotted to Priyanka, a private citizen, on the recommendations of the SPG, cabinet secretariat and the home ministry in 1997.


The directorate of estates said 35, Lodhi Estate was allotted on February 21, 1997, on payment of market rent of Rs 19,900 per month. The rent has since been revised periodically. The directorate of estates said the market rent for the property is Rs 81,865 per month. To put this in perspective, a house one-tenth the size of Priyanka's bungalow in the tony Jor Bagh commands a monthly rent of Rs 1.5 lakh to Rs 4 lakh at present. There are no houses of this size available in the heart of Delhi for private citizens.

Sunday, 14 February 2016

ఓటుకు నోటు కేసులో మ‌రో మ‌లుపు

804501201320

తెలంగాణ‌లో టీడీపీని మ‌రింత నిర్వీర్యం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్ పావులు క‌దుపుతోంది. కుదిరితే ప‌ద‌వులు ఎర‌చూపడం.. లేక‌పోతే పాత‌కేసులు తిర‌గతోడ‌తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యేని త‌మ వైపు ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఇందుకోసం కొద్ది రోజులుగా తెర‌మ‌రుగైపోయిన `ఓటుకు నోటు` కేసును వినియోగించుకోవాల‌ని చూస్తోంది. తాజాగా ఈ కేసులో మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూస‌లేం ముత్తయ్య‌కు ఏసీబీ అధికారులు నోటీసులు పంపించ‌డంతో వ్య‌వ‌హారం మ‌ళ్లీ వివాదం రాజుకుంటోంది.
టీ ఏసీబీ అధికారులు జెరూస‌లెం ముత్త‌య్య ఇంటికి వెళ్లి ఓటుకు నోటు కేసులో విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. వారంలోగా విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. ఉప్ప‌ల్‌లోని ముత్త‌య్య ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన నేప‌థ్యంలో.. మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలను త‌మ పార్టీలోకి ఆకర్షించుకునేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలో జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కూడా పార్టీలోకి ఎలాగైనా ఆక‌ర్షించాల‌ని చూస్తోంది. అందుకు ఓటుకు నోటు కేసు ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తోంది. స్టీఫెన్సన్‌కు రేవంత్‌రెడ్డి అంద‌జేసిన రూ.50ల‌క్ష‌లను మాగంటి గోపీనాథ్ స‌మ‌కూర్చారని, ఈ క్ర‌మంలో ఆయ‌న అరెస్టు కూడా త‌ప్ప‌ద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఈ అంశం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి ఈ కేసులో ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతాయో ఏమో!

జగన్‌కు డెడ్‌లైన్ నెల రోజులేనా..?

4501201047

వైకాపా అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డికి డెడ్‌లైన్‌ నెల రోజులే.. ? ఎందుకంటే త్వ‌ర‌లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జ‌రగ‌నున్నాయ‌నే వార్త‌లు వెలువడట‌మే ఇందుకు కార‌ణం. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన దాదాపు రెండేళ్ల త‌ర్వాత జ‌ర‌గ‌నున్న ఏపీలో కార్పొరేషన్ ఎన్నికలు వైకాపా స‌త్తాను చాటుకునేందు అవ‌కాశంగానే కాకుండా ఆ పార్టీ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను తేల్చే అంశంగా మార‌నున్నాయి. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఈ నెలాఖరులోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విశాఖపట్నం- భీమునిపట్నం మధ్య ఉన్న గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా కోర్టులో ఉన్న కేసుల విషయంలో ఒక అంగీకారానికి రావడం ద్వారా ఎన్నికల నిర్వహణపై ఒక నిర్ణయానికి ప్ర‌భుత్వం రావాలని నిర్ణ‌యించింది. ఈ విష‌యంపై మంత్రి నారాయణ ఈ వారంలో విశాఖ‌కు రానున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
జీవీఎంసీ ఎన్నికలకు అడ్డంకిగా నిలిచిన ఐదు గ్రామాలు కె.నగరంపాలెం, కాపులుప్పడ, చేపలుప్పడ, నిడిగట్టు, జేవీ ఆగ్రహారం విలీసం సమస్యను సామరస్యంగా, సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ నియోజ‌క‌ర్గం నుంచి పోటీ చేసిన జ‌గ‌న్ త‌ల్లి వై.ఎస్. విజయమ్మ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇటీవ‌లి కాలంలో అధికార టీడీపీ దూకుడుగా వెళుతూ తెలుగుదేశం పార్టీలోకి వ‌చ్చేవారికి పెద్ద ఎత్తున ఆహ్వానం ప‌లుకుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్నది ఒక కారణమైతే, పార్టీ అధినేత తీరు మరో కారణంగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా రాజ‌కీయ క్రాస్‌రోడ్స్‌లో వైకాపా భ‌విష్య‌త్‌ను, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌ సమర్థతను కూడా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న జీవీఎంసీ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయని వైకాపా వర్గాలతో పాటు రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నావేస్తున్నాయి.

ఫేస్‌బుక్‌లో లోకేష్ పంచ్ అదిరింది.

048045021040

తెలంగాణలో టీఆర్ఎస్ దెబ్బ‌కు టీడీపీ ఢీలా ప‌డిపోయింది. ఇప్పుడు పార్టీలో మిగిలిన‌ శ్రేణుల‌కు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత‌ను పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ తీసుకున్నారు. పార్టీలో ఉత్తేజాన్ని నింపేందుకు శాయ‌శ‌క్తులా కృషిచేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, అనంతరం ఎమ్మెల్యేలు వరుస బెట్టి గుడ్‌బై చెప్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నిర్వేదం కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఫేస్‌బుక్ వేదిక‌గా మ‌రోసారి టీఆర్ఎసస్‌కు పంచ్ ఇచ్చారు.
పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా నింపేందుకు ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన తర్వాత కూడా ఎమ్మెల్యే నిమిషాల వ్యవధిలో కండువా మార్చడం వారిని మరింత కుంగదీసింది. పులి మీద పుట్రలాగా…మాజీ ఫ్లోర్‌లీడర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు పదిమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్‌ను కోరడం ఇంకా ఇబ్బందిగా మారింది. దీంతో పార్టీ యువనేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ రంగంలోకి దిగారు. తన తండ్రి, పార్టీ అధినేత నాయకులతో ప్రత్యక్షంగా భేటీ అవుతున్న నేపథ్యంలో తన సందేశాన్ని, నమ్మకాన్ని మరో రూపంలో వినిపించారు. సోషల్‌ మీడియా వారధి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టి తన భావాలను పంచుకొని శ్రేణుల్లో భరోసా నింపారు.
ఇంతకీ లోకేష్‌ పెట్టిన పోస్ట్‌లో ఏముందంటే….`తెలుగుదేశం కార్యకర్తల కష్టంతో నాయకులుగా ఎదిగినవారిని తెరాస తన పార్టీలో చేర్చుకుంటోంది. కార్యకర్తల త్యాగ ఫలాలను దోచుకుపోతున్న తెరాసకు తెలియని విషయం ఏంటంటే… వేళ్ళు భూమిలో బలంగా నాటుకుపోయిన ఒక మహా వృక్షం తెదేపా. మీరు దొంగిలిస్తోంది పండ్లను మాత్రమే. చెట్టు మాత్రం ఏ కాలానికీ చెక్కుచెదరదు. ఈ విషయాన్ని మా కార్యకర్తలే రుజువు చేసి చూపిస్తారు.`లోతైన అంచనాతో, ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో లోకేష్‌ పెట్టిన పోస్ట్‌ తమకు ఉత్సాహాన్ని అందించేదని టీడీపీ నాయకులు చెప్తున్నారు. టీఆర్ఎస్‌కు లోకేష్ పంచ్ అదిరింద‌ని విశ్లేష‌కులు విశ్లేషిస్తున్నారు.

బీజేపీ అధ్య‌క్ష పీఠం మ‌ళ్లీ “క‌మ్మ” కేనా.. ?

408504501201

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా కాపుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌, రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియ‌తో కదంతొక్కుతోంది. రాష్ట్రంలో క‌మ్మ‌.. కాపు అని చ‌ర్చ‌లు.. సినిమాల‌తో హోరెత్తుతుంటే రాష్ట్ర బీజేపీ మాత్రం మరోసారి కమ్మ సామాజిక వర్గానికే అధ్యక్ష కిరీటం పెట్టడానికి రెడీ అవుతోందట. కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరి, కావూరు సాంబశివరావుల పేర్లు ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో వినిపిస్తున్నాయి. పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తరువాత రాయలసీమకు వలస వెళ్లారు. తనను అయిదేళ్ల పాటు విశాఖ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారన్న సంగతినే ఆమె మర్చిపోయారు.
ఇక కావూరి సాంబ‌శివ‌రావు బీజేపీలో ఉన్నా చంద్రబాబుకు అన్ని విధాలా కావాల్సిన వ్యక్తి. బంధుత్వమూ వుంది. అందుకే ఆయనకే చాన్స్ వుందని అంటున్నారు ప‌లువురు. అయితే మధ్యలో సోము వీర్రాజు పేరు కూడా వినిపిస్తోంది. గోదావరి జిల్లాకు చెందిన ఈ కాపు సామాజిక వర్గ నేతకు కాస్త నోటి స్పీడు ఎక్కువ. చంద్రబాబుపై ఊ అంటే..విరుచుకు పడుతుంటారు. వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దతు వుందని టాక్. ఈ ముగ్గురి మ‌ధ్య పోటీ ఎలా ఉన్నా ఫైన‌ల్‌గా ఢిల్లీ స్థాయిలో ప‌రిచ‌యాలు బాగా ఉన్నా కావూరి లేదా పురందేశ్వ‌రికే ఏపీ బీజేపీ ప‌గ్గాలు ద‌క్కే ఛాన్స్ ఉంద‌ని ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Wednesday, 10 February 2016

2019 ఎన్నిక‌లు కొత్త ట్విస్ట్‌

05102102120

రెండు తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగితే 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశ‌ప‌డుతున్న ప‌లువురు ఆశావాహుల‌కు షాక్ త‌ప్పేలా లేదు. రెండు తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతేనని లోక్‌సభ‌లో వైకాపా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత కోసం ఆయన సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ డాక్టర్ నసీం జైదీని కలిశారు.
జైదీని క‌లిశాక మేక‌పాటి మీడియాతో మాట్లాడారు. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెంచాల‌న్న రూల్ ఉన్నా ఎప్పుడ‌నేది స్ప‌ష్ట‌త లేద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచితే అన్ని రాష్ర్టాల్లోను పెంచాల్సి ఉంటుంద‌ని… 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన వీలుపడదని అటార్నీ జనరల్ కూడా చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో ఏపీలో 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను 225కు, తెలంగాణ‌లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను 119 నుంచి 153కు పెంచాల‌ని పేర్కొన్నారు. ఈ లెక్క‌న ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో 7గా ఉన్న అసెంబ్లీ స్థానాల‌ను 9కు పెంచాల్సి ఉంటుంది. అయితే 2026 వ‌ర‌కు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ఉండ‌ద‌న్న విష‌యం స్ప‌ష్టం కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు పెరిగితే ఎమ్మెల్యేగా పోటీ చేసి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకున్న చాలా మందికి నిరాశ త‌ప్పేలా లేదు.

Monday, 8 February 2016

మ‌హా స‌భ‌ల ఏర్పాట్ల‌కు శ్రీ‌కారం

ngo1



శ్రీకాకుళం:మ‌హా సంరంభానికి తెర‌లేచింది. ఈ నెల 12,13 తేదీల్లో ఎచ్చెర్ల శివానీ కాలేజీ ప్రాంగ‌ణంలో జ‌రిగే ఏపీ ఎన్జీఓ మ‌హాస‌భ‌ల‌కు ఏర్పాట్లు ముమ్మ‌రమ య్యాయి. ఇందులో భాగంగా శ‌నివారం ఉద‌యం శివానీ సంస్థ‌ల అధినేత దుప్ప‌ల వెంక‌ట్రావు ప‌నులు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సంఘ జిల్లా అధ్య‌క్షుడు హ‌నుమంతు సాయిరాం మాట్లాడుతూ.. ఇప్ప‌టికే స‌భా ప్రాంగ‌ణానికి సంబంధించి న‌మూనాను రూపొందించామ‌ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాక దృష్ట్యా ఎక్క‌డా ఎటువంటి ఇబ్బందీ త‌లెత్త‌కుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌ను, పొందూరు నేత కార్మికుల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా డ్వాక్రా, ఖాదీ, గిరిజ‌న ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ప్ర‌త్యేక స్టాళ్ల‌ను ఏర్పాటుచేస్తున్నామ‌ని అన్నారు. స‌భ ప్రారంభానికి ముందు జాతీయ ప‌తాకంతో పాటు, ఎన్జీఓ ప‌తాక ఆవిష్క‌ర‌ణ ఉంటుంద‌ని పేర్కొన్నారు. అదేవిధంగా స‌భ‌కు హాజ‌ర‌య్యే ఉద్యోగుల‌కు భోజ‌న వ‌స‌తి క‌ల్పించేందుకు ప్ర‌త్యేక స్టాళ్ల‌ను ఏర్పాటుచేశామ‌న్నారు. వేదిక నిర్మాణానికి సంబంధించి త‌మ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌రుచూరి అశోక్ బాబు కొన్ని సూచ‌న‌లు చేశార‌ని, వాటికి అనుగుణంగా సంబంధిత ప‌నులు ముమ్మ‌రం చేస్తున్నామన్నారు.
ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా సైకత శిల్పం
స‌భా ప్రాంగ‌ణంలో 10 ఇంటూ 10 విస్తీర్ణంలో ఎల్‌.ఎన్‌.పేట కు చెందిన క‌ళాకారుడు తరుణీ మిశ్రో నేతృత్వంలో ఎన్జీఓ సంఘం లోగోతో కూడిన ప్ర‌త్యేకంగా సైక‌త శిల్పాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ప్ర‌తిభావంతుడైన క‌ళాకారుడ్ని ప్రోత్స‌హించే దిశ‌గా తామీ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా కార్య‌ద‌ర్శి ఆర్‌.వి.ఎన్‌.శ‌ర్మ తెలిపారు. కార్యక్ర‌మంలో ఎన్జీఓ సంఘ ప‌ట్ట‌ణ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ఎల్‌.జ‌గ‌న్మోహ‌న్ రావు, ఆర్‌.వేణుగోపాల్‌, జిల్లా కార్య‌వ‌ర్గ ప్ర‌తినిధులు బి.హ‌రికృష్ణ‌, కె.శ్రీ‌నివాస్‌, శివానీ విద్యాసంస్థ‌ల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ ప్ర‌సాద్ పాల్గొన్నారు.
శ్రీ చ‌క్ర పీఠంలో ప్ర‌త్యేక పూజ‌లు
జిల్లాలో తొలిసారి గా త‌ల‌పెడుతున్న మ‌హాస‌భ‌లు విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటూ కుంచాల- కుర్మ‌య్యపేట (ఎచ్చెర్ల‌)లో ఉన్న శ్రీ చ‌క్ర‌పీఠం లో ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌రుచూరి అశోక్ బాబు శ‌నివారం ఉద‌యం ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆయ‌న‌ను వేద పండితులు ఆశీర్వ‌దించి, ప్ర‌సాదం అంద‌జేశారు. తొలుత అశోక్ బాబు పీఠం నిర్వాహ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న వెంట ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర స‌హాధ్య‌క్షులు చౌద‌రి పురుషోత్తం నాయుడు, జిల్లా కార్య‌వ‌ర్గ ప్ర‌తినిధులు ఉన్నారు.
ముగిసిన రెండు రోజుల ప‌ర్య‌ట‌న
ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్య‌క్ష్యుడు ప‌రుచూరి అశోక్ బాబు రెండు రోజుల జిల్లా ప‌ర్య‌ట‌న శ‌నివారంతో ముగిసింది. మ‌హాస‌భ‌ల ఏర్పాట్ల‌కు సంబంధించి జిల్లా కార్య‌వ‌ర్గానికి అనేకానేక సూచ‌న‌లు చేశారు. స‌భ‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను తీసుకున్న జిల్లా కార్య‌వ‌ర్గాన్ని మ‌న‌స్ఫూర్తిగా అభినందించారు. అనంత‌రం ఆయ‌న రోడ్డు మార్గంలో విశాఖ చేరుకున్నారు.

చిరు ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే?

chiranjeevi-pioitics-0244

ప్ర‌జారాజ్యం పార్టీ ఎందుకు విఫ‌ల‌మైంది? రాజ‌కీయాల్లో చిరు ఎందుకు స‌ఫ‌లం కాలేక‌పోయారు? ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చాడు మెగా స్టార్‌. సరైన కోర్ టీమ్ ను ఎంపిక చేసుకోలేకపోవడమే త‌న ఓట‌మికి కార‌ణ‌మ‌ని ఒప్పుకున్నారు. త‌న‌నెవరూ వెన్ను పోటు పొడవలేదని స్ప‌ష్టంచేశారు. 60వ జన్మదినోత్సవం సంద‌ర్భంగా మీడియాతో త‌న సినీ, రాజ‌కీయ జీవితాల‌కు సంబందించిన ఆస‌క్తిదాయ‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. రాజకీయాలలోకి వచ్చినందుకు ఏ మాత్రం చింతించ‌డం లేదని , ప్రజా సేవ చేసేందుకు దీన్నొక అవకాశంగా భావించానని అన్నారు. ప్రజల తరఫున పోరాడేందుకు తానెప్పుడూ సిద్ధ‌మేన‌ని, ఇప్పటికీ ప్రజలు త‌న‌పై ఆదరాభిమానాలు చూపుతుతున్నార‌ని అన్నారు. రాజకీయంగా సఫలం కాలేకపోయినా, ఈ రంగంలోకి రావడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు. కాగా.. ఎనిమిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా, చిత్ర‌సీమ‌కు సంబంధించిన వేడుక‌ల‌కు వెళ్లినప్పుడు మ‌ళ్లీ సొంత సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్న‌ట్లు ఉంటుంద‌ని సంతోషం వ్య‌క్తంచేశారు.

కాపుల రిజర్వేషన్ల కోసం పవన్ పోరాటం ?



 dfgdfgdfg

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే నినాదంతో పోరాటం చేయబోతున్నారా ? బీజేపీ ఎమ్మెల్సీ, పవన్ కు సన్నిహితుడిగా పేరున్న సోము వీర్రాజు మాటలను బట్టి అవుననే అనిపిస్తోంది. కాపులకు రిజర్వేషన్ల ఇచ్చే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడినట్టు సోము వీర్రాజు తెలిపారు. అంతేకాదు ఎన్నికలకు ముందు కాపుల సంక్షేమానికి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని… లేని పక్షంలో ఆ సామాజికవర్గమంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఇటీవలకాలంలో సోము వీర్రాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ… ఈ సారి ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. స్వతహాగా కాపు కులానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తనకు కులాల పట్టింపు లేదని… తాను కాపునాయకుడిగానే మిగిలిపోవాలని భావించడం లేదని పలుసార్లు బాహాటంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తారా అనే విషయం చర్చనీయాంశంగా మారుతోంది. ఒకవేళ అదే జరిగితే… ఎంతోమందికి ఆరాధ్య నటుడిగా ఉన్న పవన్… కాపు నాయకుడిగానే మిగిలిపోవాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి… తనకు సన్నిహితుడైన సోము వీర్రాజు వ్యాఖ్యలపై పవర్ స్టార్ స్పందిస్తాడా లేక సైలెంట్ గా ఉంటాడా అన్నది చూడాలి.

సొంత నేతల జేబులు గుల్ల చేస్తున్న జ‌గ‌న్‌ !

56905260596020

వివిధ జిల్లాల్లో ఉన్న వైకాపా నాయ‌కులు ఇప్పుడు తెగ ఇబ్బందులు ప‌డుతున్నారు. అస‌లే కేసులు, అరెస్టుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న నేత‌ల‌కు కొత్త చిక్కులొచ్చిప‌డ్డాయి. అది కూడా
అధికార పార్టీ నేత‌ల‌తో కాద‌ట‌. సొంత పార్టీ అధినేత జ‌గ‌న్‌తో. అదేంటి అనుకుంటున్నారా? అవును జ‌గ‌న్ వ‌ల్ల నేత‌ల జేబులకు చిల్లులు ప‌డుతున్నాయ‌ట‌. ఇందుకు కార‌ణం అధినేత ప‌ర్య‌ట‌న‌లేన‌ట‌.
  వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జిల‌కు, ఆ పార్టీ తరపున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కొత్త దిగులు మొదలైంది. ఈ మధ్య కాలంలో వివిధ నియోజకవర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుగుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి. మరి అధినేత ఈ విధంగా టూర్లకు వచ్చినప్పుడు అయ్యే ఖర్చును భరించాల్సింది నియోజకవర్గ ఇన్ చార్జీలే కదా! రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయిన ప్రస్తుత నేపథ్యంలో వైకాపా అభ్యర్థుల పాలిట ఈ ఖ‌ర్చు భారంగా మారుతోందట‌. ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాలతో ముడి పడి ఉండటంతో వీరికి ఈ భయం మొదలైంది.
 ఒకసారా రెండు సార్లా.. కొన్ని నియోజకవర్గాల్లో జగన్ రెడ్డి ఇప్పటికే నాలుగైదు సార్లు పర్యటించిన సందర్భాలున్నాయి. మరి ఈ సందర్భంలో వివిధ ఏర్పాట్లకు ఖర్చు చేయాల్సి వస్తోందట‌. ఈ భారమంతా ఇన్‌చార్జిల మీదే పడుతోంది. దీంతో పార్టీ ఇన్ చార్జిల జేబులు ఖాళీ అవుతున్నాయి.  దీంతో కక్కలేని మింగలేని పరిస్థితిలో వైకాపా ఇన్ చార్జిలు పడిపోతున్నార‌ట‌. ఒకవైపు ఎన్నికలకి ఇంకా మూడు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది.  ఇప్పటి నుంచి ఇలా ఖర్చులు పెట్టుకోవడం మొదలైతే.. ఎన్నికల నాటికి తాము చప్పబడి పోతామ‌ని.. వాళ్లు గ‌గ్గోలు పెడుతున్నార‌ట‌. జ‌గ‌న్ టూర్ల దెబ్బ‌ల‌కు త‌మ జేబులు గుల్ల అవుతున్నాయ‌ని వారు ఇంట‌ర్న‌ల్‌గా వాపోతున్నార‌ట‌. అసలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిధుల కటకట ఉంటుంది.. మొన్నటి ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. మ‌రి జ‌గ‌న్ వాళ్ల ప‌రిస్థితి అర్థం చేసుకుంటాడో లేదో! చూడాలి.

పవన్ కి కాపు వర్గం గట్టి షాక్ !

4080450102104

పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ కి కాపు వర్గం గట్టి షాకింగ్ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం తునిలో కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు ఐక్యవేదిక ఏర్పాటు చేసిన మహా గర్జన ఉద్రిక్తంగా మారిందనే విషయం తెలిసిదే. ఇందులో ఓ రైలునే తగలబెట్టారు ఆంధోళనకారులు. ఈ సంఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ఓ ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడు అనేదానిపై క్లారిటీ లేకుండా మాట్లాడాడు. మొత్తంగా రైలు తగలబెట్టడం అసాంఘీక శక్తుల చర్య అయి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తను ప్రత్యేకంగా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదని అనటంతో…కాపు వర్గం మండిపడింది. పవన్ కళ్యాన్ కాపు వర్గానికి మద్దతు ఇవ్వకుండా…తను కాపు వర్గానికి సపోర్ట్ చేయను అన్నట్టుగా మాట్లాడటం ఇక్కడ కాపు వర్గానికి నచ్ఛలేదంట. దీంతో కాపు వర్గం నుండి పవన్ కళ్యాన్ పై నిరసనలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కాపు ఐఖ్యత కోసం జరుగుతున్న పోరాటంలో కొంత మంది పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మని దగ్ధం చేయటానికి ప్లాన్ చేసుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే కాపులను గుర్తించాలంటూ తను ట్విట్టర్ నుండి మద్దతు ప్రకటించాడు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని, అధికార పార్టీ కూడా ఈ డిమాండ్‌కు మద్ధతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశాడు. కాపుల డిమాండ్‌ను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీని పవన్ కోరారు. అయితే కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ నుండి బయటకు వచ్చి, ప్రజల మధ్యలో ఉండి పోరాడాలని అంటున్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పంధిస్తాడో అనేది చూడాలి మరి.

Saturday, 6 February 2016

జ‌న‌సేన ప‌గ్గాలు మారుతున్నాయా..!

janasena-28822

మొన్న‌టివ‌రకూ మెగా ఫ్యామిలీలో భ‌గ్గుమ‌న్న విభేదాలు సద్దుమ‌ణిగాయా? మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ళ్లీ ఒక్క‌టి కాబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ త‌న‌ని లైట్ తీసుకుంద‌ని భావించిన చిరంజీవి.. త‌మ్ముడి జ‌న‌`సేన‌`లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? త‌మ్ముడితో క‌లిసి రాష్ట్రంలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.
చిరంజీవి పుట్టిన రోజు వేడుక‌లు మొద‌లైన ద‌గ్గ‌ర నుంచీ.. మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ధ్య రిలేష‌న్స్ లైన్‌లోకి వ‌చ్చాయి. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ గెట‌ప్‌లో చిరంజీవి ఇంటికి వెళ్ల‌డం.. త‌రువాత మెగాస్టార్ చిరంజీవి.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సెట్లో త‌ళుక్కున మెర‌వ‌డం వంటి సంఘ‌ట‌న‌లు వీరి మ‌ధ్య దూరాన్ని త‌గ్గించేశాయి. ప్ర‌స్తుతం మ‌రో వార్త ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతుంది. జ‌న‌సేన పార్టీతో చిరంజీవి క‌ల‌వ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా ఉంది. అలాగే దేశంలోనూ ఆ పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు వాళ్ల‌కు అవ‌కాశం వ‌చ్చేలా కూడా క‌నిపించ‌ట్లేదు. ఇటువంటి స‌మ‌యంలో పార్టీలోనే ఉంటే.. అది వ్య‌క్తిగ‌తంగానూ మైన‌స్సే అని చిరు భావిస్తున్నార‌ట‌.
మ‌రోప‌క్క ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మారాడు. ప్ర‌స్తుతం ఆ పార్టీని పూర్తిస్థాయిలో ప‌వ‌న్ ఒక్క‌డే న‌డ‌ప‌లేక‌పోతున్నాడు. అందుకే ఇటువంటి స‌మ‌యంలో తమ్ముడితో ఉంటే మంచిద‌నే అభిప్రాయానికి చిరు వ‌చ్చాడ‌ని స‌మాచారం. ఇటువంటి స‌మ‌యంలో ప‌వ‌న్‌తో క‌లిసి రాష్ట్రంలో చ‌క్రం తిప్పాల‌ని చూస్తున్నాడు చిరంజీవి. మొన్న స‌ర్దార్ సెట్ లో ప‌వ‌న్‌ను క‌లిసిన‌పుడు కూడా చిరంజీవి ఈ విష‌యంపై చ‌ర్చించార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతోపాటు త‌న కుమార్తె శ్రీ‌జ పెళ్లి విష‌యంపై కూడా ప‌వ‌న్ తో మాటామంతి జ‌రిపాడ‌ని.. ఆ త‌ర్వాత స‌ర్దార్ ముచ్చ‌ట్లు తెలుసుకున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చిరంజీవి జ‌న‌సేన‌లో చేరితే.. అన్న‌కే ప‌వ‌న్‌ పార్టీ ప‌గ్గాలు అప్ప‌జెపుతాడ‌న్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి.

Friday, 5 February 2016

చ‌ంద్ర‌బాబుతో ప‌వ‌న్ దోస్తీకి క‌టీఫ్?

pawan-kalyan-babu-2872

‘‘మనం నమ్మిన పార్టీ విధానాలు దేశానికి అనుకూలంగా ఉన్నంత కాలం ఆ..పార్టీతో ఉంటాం.
విధానాలకు భిన్నంగా ప్రవర్తించినపుడు కూడా ఆ పార్టీతోనే ఉంటే మనం నేరం చేస్తున్నట్టే లెక్క”
– రాంజెఠ్మలాని, ప్ర‌ముఖ న్యాయ‌వాది
ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ పవన్ ట్వీట్ చేశాడు. అంటే టీడీపీకి ప‌వ‌న్ గుడ్ బై చెబుతున‌ట్లేనా..? చ‌ంద్ర‌బాబుతో దోస్తీకి క‌టీఫ్ చెప్పిన‌ట్లేనా? ఔన‌నే అంటున్నాయ్ ప‌రిణామాలు. రాజ‌ధాని నిర్మాణం పేరుతో టీడీపీ చేప‌డుతున్న భూ సేక‌ర‌ణ‌పై గ‌త కొద్దికాలంగా జ‌న‌సేనాని గుర్రుగా ఉన్న విష‌యం తెలిసిందే! తాను వ‌ద్దంటున్నా ప్ర‌భుత్వం మొండిగా ప‌ది గ్రామాల్లో భూ సేక‌ర‌ణ‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌డాన్నీ త‌ప్పుప‌డుతున్నారాయ‌న‌. అందుకే స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్ ర‌ద్దు చేసుకుని మ‌రీ! హైద్రాబాద్ వ‌చ్చేశారు. త్వ‌ర‌లోనే గుంటూరు ప‌ర్య‌ట‌న ఉండ‌బోతోంద‌ని కూడా.. తెలుస్తోంది.
మ‌రోవైపు.. మరో రెండు రోజుల్లో బాబు-పవన్ కలవనున్నారు. భూసేక‌ర‌ణ ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో కూడా వివ‌రించ‌నున్నారు. ఆ స‌మావేశం త‌రువాత ప‌వ‌న్ స్టాండ్ మారుతుంద‌ని కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నారు. జ‌న‌సేనాని త‌మ దారికి త‌ప్ప‌క వ‌స్తాడ‌ని ఆశాభావంతో ఉన్నారు.

కాపుల రిజర్వేషన్ల కోసం పవన్ పోరాటం ?

dfgdfgdfg

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే నినాదంతో పోరాటం చేయబోతున్నారా ? బీజేపీ ఎమ్మెల్సీ, పవన్ కు సన్నిహితుడిగా పేరున్న సోము వీర్రాజు మాటలను బట్టి అవుననే అనిపిస్తోంది. కాపులకు రిజర్వేషన్ల ఇచ్చే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడినట్టు సోము వీర్రాజు తెలిపారు. అంతేకాదు ఎన్నికలకు ముందు కాపుల సంక్షేమానికి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని… లేని పక్షంలో ఆ సామాజికవర్గమంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఇటీవలకాలంలో సోము వీర్రాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ… ఈ సారి ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. స్వతహాగా కాపు కులానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తనకు కులాల పట్టింపు లేదని… తాను కాపునాయకుడిగానే మిగిలిపోవాలని భావించడం లేదని పలుసార్లు బాహాటంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తారా అనే విషయం చర్చనీయాంశంగా మారుతోంది. ఒకవేళ అదే జరిగితే… ఎంతోమందికి ఆరాధ్య నటుడిగా ఉన్న పవన్… కాపు నాయకుడిగానే మిగిలిపోవాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి… తనకు సన్నిహితుడైన సోము వీర్రాజు వ్యాఖ్యలపై పవర్ స్టార్ స్పందిస్తాడా లేక సైలెంట్ గా ఉంటాడా అన్నది చూడాలి.

ప‌వ‌న్ ఫ్లెక్సీలు చించేస్తున్న కాపులు

4801450120878

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కులాల‌కు, మ‌తాల‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎవరైనా ఒకరు ఏదైనా
రంగంలో పైకొస్తే.. ఆ కులానికి చెందిన వారంతా సదరు వ్యక్తిని తమ వ్యక్తిగా ఓన్ చేసుకోవటం కనిపిస్తుంది. ప్రాంతీయంగా కూడా కొందరి విషయంలో ఇలా జరుగుతుంది. ఇక రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్ర‌ముఖ సినీ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌న్ తాను ఏ వ‌ర్గానికి చెంద‌ని వాడిన‌ని చెపుతున్నా కాపులు మాత్రం ప‌వ‌న్‌ను త‌మ వ‌ర్గానికి చెందిన‌వాడిగా భావిస్తుండ‌డం స‌హ‌జం.
అయితే తాజాగా కాపు గ‌ర్జ‌న సంద‌ర్భంగా జ‌రిగిన హింస‌తో పాటు కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం జ‌రుగుతున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ నిలుస్తాడ‌ని ఆశించిన ప‌వ‌న్ తనకు కులాలు పట్టవని.. కాకుంటే కాపుల విషయంలో కొన్ని దశాబ్దాలుగా అన్యాయం జరిగిందన్న మాటను చెప్పుకొచ్చారు. అయితే.. ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలే తప్పించి.. హింస పనికి రాదని హితవు పలికారు. తమకు అన్యాయం జరిగిందన్న ఆక్రోశంలో ఉన్న పలువురు కాపులకు పవన్ మాటలు అస్సలు నచ్చలేదు.
కాజు గ‌ర్జ‌న‌, కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప‌వ‌న్ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చి, త‌మ త‌ర‌పున గ‌ట్టిగా గ‌ళం వినిపిస్తాడ‌నుకుంటే ఇలా మాట్లాడ‌డం వాళ్ల‌కు రుచించ‌లేదు. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆయన ఫ్లెక్సల్ని చించివేస్తూ.. పవన్ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపల్లె మండలం ఉప్పూడి.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. నర్సాపురం ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల్సి చింపేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. ప‌వ‌న్‌ నాలుగు మాటలు చెప్పేసి సినిమా షూటింగ్ కు వెళ్లటం పట్ల కొందరు కాపు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కాపు గ‌ర్జ‌న‌, రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప‌వ‌న్ త‌న సొంత సామాజిక‌వ‌ర్గం వారి మంట‌ల్లో చిక్కుకున్న‌ట్టే స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Thursday, 4 February 2016

కాపు గ‌ర్జ‌న‌కు కౌంట‌ర్‌గా బీసీ గ‌ర్జ‌న‌

bc-garjana-222

‘కాపు గ‌ర్జ‌న’ హింస గ‌ర్జ‌న‌గా మారి ప్రభుత్వాన్ని డిఫెన్సులో ప‌డేసింది.కాపు గ‌ర్జ‌న పేరుతో తూర్పుగోదావ‌రి జిల్లా తునిలో రైలు, పోలీసు స్టేష‌న్లు త‌గుల‌బెట్టిన సంగ‌తి తెలిసిందే.. ఈ నేప‌థ్యంలో బీసీ సంఘాలు ఉద్య‌మ రంగంలోకి దిగ‌బోతున్నాయి. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే సహించేది లేదని ప్రభుత్వం మెడలు వంచైనా రిజర్వేషన్లను అడ్డుకుంటామని బీసీ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. కాపులకు బీసీల హోదా వ్యవహారం ఏపీలో బీసీలను ఒక్కతాటిపైకి తెచ్చేలా కనిపిస్తోంది. కాపులకు బీసీ హోదా ఇస్తే రోడ్లపైకొచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనికోసం కాకినాడలో భారీ బహి రంగసభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కాపు నేత‌ల‌కు కౌంట‌రుగా బీసీ గ‌ర్జ‌న నిర్వ‌హించేందుకు బీసీ సంఘాలు స‌న్నాహాలు చేస్తున్నాయి. కాపులు ప్రభుత్వాన్ని బెదిరించేందుకే తునిలో ఘర్షణలు సృష్టించారని భావిస్తున్న బీసీలు ఆ విధంగా ఒకవేళ ప్రభుత్వం బెదిరింపులకు తలొగ్గితే తాము కూడా జిల్లాకో సభ నిర్వహించి రోడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు. కాపుల‌ను బీసీల్లో చేర్చే వ్య‌వ‌హారాన్ని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని కొన్ని పట్టణాల్లో పర్యటించిన కృష్ణయ్య ప్రాణాలొడ్డయినా కాపు రిజర్వేషన్లను అడ్డుకుంటామని అవసరమైతే బీసీలంతా రోడ్లపై కొచ్చి కూర్చుంటామని హెచ్చరిస్తున్నారు.
కాపులను బీసీల్లో చేర్చితే సర్పంచ్ – ఎంపీటీసీ -జ‌డ్పీటీసీ – కౌన్సిలర్ – కార్పొరేటర్ ఎన్నికలలో మొత్తం రిజర్వేషన్లు కాపులే కొట్టేస్తారని బీసీ సంఘాలు అంటున్నాయి. ఓబీసీ కోటాలోనూ వారి డామినేషన్ పెరిగిపోతుందని అంటున్నారు. బీసీలను దూరం చేసుకుంటే టీడీపీకి పుట్టగతులు ఉండవని.. టీడీపీకి కాపులు కావాలా? బీసీలు కావాలో చంద్రబాబు చెప్పాలని బీసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితి ఎదురవుతోంది.

తమ్ముడి రాజకీయంపై చిరు కామెంట్

pawan-kalyan-chiru-44

జ‌న‌సేనాని ప‌వ‌న్ రాజ‌కీయ య‌వ‌నిక‌(పొలిటిక‌ల్ డ‌యాస్‌)పై దూసుకుపోతున్నారు. స‌మాకాలీన అంశాల‌పై ప్ర‌తిస్పందిస్తూ.. ట్విట్లు చేస్తూ.. అభిమానులనే కాదు సామాన్యుల‌నూ ఆలోచింప‌జేస్తున్నారు. అంతేకాదు వీలున్నంత వ‌ర‌కూ సినీ మాధ్య‌మాన్నీ.. పాట సాహిత్యాన్నీ త‌న భావజాల వ్యాప్తికి వాడుకుంటున్నారు. కానీ చిరు అలా కాదు. త‌న ప‌నేదో త‌న‌ది. మెగాస్టార్‌గా ఆయ‌న అంద‌రి మ‌న్న‌న‌లు చూర‌గొన్నా.. ఫుల్ం పొలిటీష‌న్‌గా అంద‌రివాడు అనిపించుకోలేక‌పోయారు. పీఆర్పీని స్థాపించి, కాంగ్రెస్‌లో విలీనం చేసి కొంత విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ్ముడు రాజకీయ ప్రస్థానంపై చిరంజీవి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. పవన్, తాను విభిన్న రాజకీయ దారుల్లో వెళ్తున్నామని అన్నారు. ప్ర‌స్తుతం నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా అది త‌న సొంత పార్టీ కాద‌ని, అక్క‌డ తాను చెప్పినట్లు జరగదని చెబుతూ ఆస‌క్తిదాయ‌క చ‌ర్చ‌కు తెర‌లేపారు. పవన్, మీరు.. ఒక రాజకీయ వేదికపైకి వస్తే బావుంటుంది కదా.. అన్న ప్రశ్నకు అలాంటి పరిణామం జరుగుతుందని తాను అనుకోవడం లేదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్దికాలంలోనే తనకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని నిర్వేదం వ్యక్తం చేశారు. సో.. ఫైనల్ గా పవన్, చిరు పొలిటికల్ గా మాత్రం కలవరు. రేప‌టి వేళ‌.. జ‌న్మ‌దిన వేడుక‌ల్లోనైనా క‌లుస్తారా.. అభిమానుల‌ను అల‌రిస్తారా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. స‌మాధానం కోసం శ‌నివారం ఉద‌యం దాకా వేచి చూడండి. స్టే ట్యూన్ టు మెగా కాంపౌండ్‌.

మోదీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబీకుడే

05804502045845

ఒక చాయ్‌వాలా ప్ర‌ధాని అయిన దేశం మ‌న‌ది. అతి పెద్ద ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థకి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఉండ‌దు. కుల‌మ‌త జాతివిభేదాలు లేకుండా 120 కోట్ల మంది ప్ర‌జ‌లు జీవిస్తున్న దేశం.. ప్ర‌ధాని అంటే.. సూటూ, బూటూ, కార్లు, బంగ‌ళాలు, నాలుగు బ్యాంకు అకౌంట్లు.. రాజ‌భోగాలు అన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్ర‌ధాని మోడీ ఆస్తుల విలువ ఎంత‌? ఆయ‌నకు ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి? ఆయ‌న స్థిర,చ‌రాస్తుల విలువ ఎంత‌? అనే సందేహం ఎప్పుడో ఒకప్పుడు రాక‌పోదు. ఆయ‌న ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. రూ.1.41కోట్లు. ఏంటి న‌మ్మ‌శ‌క్యంగా లేదా! ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో ఉన్న న‌గ‌దు ఎంతో తెలుసా.. రూ.4,700. మోదీ 13 ఏళ్ల క్రితం కొన్న ఇంటి విలువ 25 రెట్లు పెరగడంతో ఆస్తుల విలువ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి వరకున్న మోడీ ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) తాజాగా ప్రకటించింది.
పీఎంఓ వివరాల ప్రకారం.. 2014, మే 26న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ పేరున ఎలాంటి వాహనం లేదు. ఆయన ఇప్పటికీ తన బ్యాంకు ఖాతాను గుజరాత్‌లోనే కొనసాగిస్తున్నారు. ఆయనకు ఎలాంటి రుణాలూ లేవు. మోడీ వద్ద దాదాపు 45 గ్రాముల బరువైన నాలుగు బంగారు ఉంగరాలున్నాయి. 2015, మార్చి 31 నాటికి వాటి విలువ రూ.1.19 లక్షలు. 2016 జనవరి 30 వరకు వివరాలను పీఎంఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇక పెట్టుబడుల విషయానికొస్తే, రూ.20 వేల విలువైన ఎల్‌అండ్‌టీ బాండ్లు (ట్యాక్స్ సేవింగ్స్), రూ.5.45 లక్షల విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, రూ.1.99 లక్షల విలువైన జీవిత బీమా పాలసీలున్నాయి.
మోడీ చరాస్తుల మొత్తం విలువ రూ.41.15 లక్షలు. స్థిరాస్తి విషయానికొస్తే, గాంధీనగర్‌లోని ఒక ఇంట్లో నాలుగోవంతు వాటా ఉంది. 3,531.45 చదరపు అడుగుల ఈ వాటాలో 169.81 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉంది. దీన్ని 2002 అక్టోబర్ 25న రూ.1,30,488తో కొనుగోలు చేశారని పీఎంఓ తెలిపింది. దీనిపై పెట్టుబడుల రూపంలో చేసిన నిర్మాణానికి రూ.2,47,208 అయిందని పేర్కొంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ. కోటి ఉందట‌. బ్యాంకు డిపాజిట్లకొస్తే, ఎస్‌బీఐలో రూ.94,903, రాజ్‌కోట్ నాగ్‌రిక్ సహకారి కోఆపరేటివ్ బ్యాంకులో రూ.30,347 డిపాజిట్లు ఉన్నాయి. దీంతోపాటు ఎస్‌బీఐలో రూ.30,72,017 విలువైన ఎఫ్‌డీలున్నాయి. ఆయన భార్య జశోదాబెన్ ఆస్తుల వివరాలు తెలియవని వెల్లడించారు.

Tuesday, 2 February 2016

జ‌గ‌న్ అంటే ఇష్టంలేని వైకాపా ఎమ్మెల్యేలు

ys-jagan-82822

అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. నాయ‌క‌త్వ లోపాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది వైకాపా. ముఖ్యంగా అధినేత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు పార్టీకి లాభం చేకూర్చ‌క‌పోగా.. తిరిగి న‌ష్టం చేకూరుస్తున్నాయి. అయితే జ‌గ‌న్ పనితీరుపై ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నార‌న‌డానికి.. ఆ పార్టీ నుంచి టీడీపీలో చేరుతున్న వారే నిద‌ర్శ‌నం. కొంద‌రు గ‌త్యంత‌రం లేకే అక్క‌డ కొన‌సాగుతున్నార‌ని స్పీక‌ర్ కోడెల విమ‌ర్శించారు. వైఎస్‌ జగన్‌ తీరు నచ్చక అనేక మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే, ఇక్కడ చేర్చుకోవడానికి అంగీకరించకపోవడంతో తప్పనిసరై జగన్‌ తోనే కొనసాగుతున్నారని, ఇదే విషయాన్ని అనేక మంది ఎమ్మెల్యేలు తన వద్ద ప్రస్తావించారని స్పీకర్‌ కోడెల తెలిపారు.
రాష్ట్రంలో జగన్‌ వ్యాపారానికి ఎక్కువ, రాజకీయాలకు తక్కువని స్పీకర్‌ కోడెల ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న జగన్‌.. దాని కోసం రాజమార్గంలో వెళ్లాలని సూచించారు. కానీ, జగన మాత్రం వక్రమార్గంలో వెళుతున్నారని ఆరోపించారు. తనను హంతకుడిగా చిత్రీకరించడానికి జగన్‌ ప్రయత్నించడం వల్లే బహిరంగంగా వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కాపు గర్జనకు ఎంత మంది వస్తారు? అవాంఛనీయ ఘటనలు జరుగుతాయా… రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న మద్దతు వంటి అంశాలను ఇంటెలిజెన్స్ విభాగం సక్రమంగా అంచనా వేయలేకపోయిందన్నారు.
ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మృతి చెందినప్పుడు అందరూ బాధ పడ్డారని, దేశవ్యాప్తంగా అందరూ శోక సముద్రంలో ఉండగా జగన మాత్రం సీఎం పదవి కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల సంతకాలతో బిజీగా గడిపారని కోడెల విమర్శించారు. పరామర్శకు ఇంటికి వచ్చిన సోనియా గాంధీని సీఎం పదవి కావాలని కోరారని, ఇదా ఓ తండ్రికి కొడుకుగా ఇచ్చే గౌరవమని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా హుందాగా వ్యవహరించాల్సిన జగన ఆ పార్టీ ఎమ్మెల్యేలను సీఎం, స్పీకర్‌పై ఉసిగొల్పుతున్నారని కోడెల ఆరోపించారు.