Tuesday, 2 February 2016

జ‌గ‌న్ అంటే ఇష్టంలేని వైకాపా ఎమ్మెల్యేలు

ys-jagan-82822

అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. నాయ‌క‌త్వ లోపాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది వైకాపా. ముఖ్యంగా అధినేత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు పార్టీకి లాభం చేకూర్చ‌క‌పోగా.. తిరిగి న‌ష్టం చేకూరుస్తున్నాయి. అయితే జ‌గ‌న్ పనితీరుపై ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నార‌న‌డానికి.. ఆ పార్టీ నుంచి టీడీపీలో చేరుతున్న వారే నిద‌ర్శ‌నం. కొంద‌రు గ‌త్యంత‌రం లేకే అక్క‌డ కొన‌సాగుతున్నార‌ని స్పీక‌ర్ కోడెల విమ‌ర్శించారు. వైఎస్‌ జగన్‌ తీరు నచ్చక అనేక మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే, ఇక్కడ చేర్చుకోవడానికి అంగీకరించకపోవడంతో తప్పనిసరై జగన్‌ తోనే కొనసాగుతున్నారని, ఇదే విషయాన్ని అనేక మంది ఎమ్మెల్యేలు తన వద్ద ప్రస్తావించారని స్పీకర్‌ కోడెల తెలిపారు.
రాష్ట్రంలో జగన్‌ వ్యాపారానికి ఎక్కువ, రాజకీయాలకు తక్కువని స్పీకర్‌ కోడెల ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న జగన్‌.. దాని కోసం రాజమార్గంలో వెళ్లాలని సూచించారు. కానీ, జగన మాత్రం వక్రమార్గంలో వెళుతున్నారని ఆరోపించారు. తనను హంతకుడిగా చిత్రీకరించడానికి జగన్‌ ప్రయత్నించడం వల్లే బహిరంగంగా వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కాపు గర్జనకు ఎంత మంది వస్తారు? అవాంఛనీయ ఘటనలు జరుగుతాయా… రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న మద్దతు వంటి అంశాలను ఇంటెలిజెన్స్ విభాగం సక్రమంగా అంచనా వేయలేకపోయిందన్నారు.
ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మృతి చెందినప్పుడు అందరూ బాధ పడ్డారని, దేశవ్యాప్తంగా అందరూ శోక సముద్రంలో ఉండగా జగన మాత్రం సీఎం పదవి కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల సంతకాలతో బిజీగా గడిపారని కోడెల విమర్శించారు. పరామర్శకు ఇంటికి వచ్చిన సోనియా గాంధీని సీఎం పదవి కావాలని కోరారని, ఇదా ఓ తండ్రికి కొడుకుగా ఇచ్చే గౌరవమని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా హుందాగా వ్యవహరించాల్సిన జగన ఆ పార్టీ ఎమ్మెల్యేలను సీఎం, స్పీకర్‌పై ఉసిగొల్పుతున్నారని కోడెల ఆరోపించారు.

No comments:

Post a Comment