Thursday, 4 February 2016

కట్టప్ప సీక్రేట్ రాజమౌళి చేప్పేశాడు

80450120101

బాహుబ‌లి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న బాహుబ‌లి 2 టెంపో ఏమాత్రం సడలకుండా చూసేందుకు డైరెక్టర్ రాజమౌళి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. జక్కన్న సరికొత్త ప్రయోగాలు టాలీవుడ్ లో నయా ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇందులో భాగంగా గ్రాఫిక్స్ ఇండియాతో కలిసి ఈ మూవీ యూనిట్ బాహుబలి ది బిగినింగ్ కామిక్స్‌ను రిలీజ్ చేయబోతోంది. హాలీవుడ్ లో ఒక సినిమా రూపొందిందంటే, ఆ సినిమాకు సంబంధించిన స్టోరీతో వీడియో గేమ్ ల‌తో పాటు ఆ చిత్రంలోని పాత్ర‌ల‌కు పోలిన బొమ్మ‌లు రెడీ చేసి మార్కెట్ లోకి ప్ర‌వేశ పెడ‌తారు. ఈ వీడియో గేమ్‌లు, డాల్స్ సినిమాపై విప‌రీత‌మైన ఆస‌క్తిని పెంచేస్తాయి. పిల్ల‌ల్లో అయితే మ‌రీనూ. అయితే ఈ ప‌ద్ధ‌తిని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న బాహుబ‌లి -2 చిత్రానికి అప్లై చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది.
ఈ కొత్త ప్రయోగంతో బాహుబ‌లి-2 మార్కెట్ ను పెద్ద ఎత్తున్న చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడట రాజ‌న్న‌. ఇప్ప‌టికే దానికి సంబంధించిన అంత‌ర్జాతీయ స్థాయి నిపుణుల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ని తెలుస్తోంది. యూనివర్స్ ఆఫ్ బాహుబలి పేరిట వచ్చే ఈ కామిక్స్ లో యానిమేషన్స్, గేమ్స్ కూడా ఉంటాయని, టాలీవుడ్ లో ఇలాంటి ఎక్స్ పెరిమెంట్స్ ఎప్పుడూ జరగలేదని అంటున్నారు. బాహుబలి కన్ క్లూజన్ మీద హైప్ పెంచేందుకు జక్కన్న ఇలా న్యూ స్ట్రాటేజీ అవలంభిస్తున్నాడు. ఈ కామిక్స్ లో కట్టప్ప గుట్టు విప్పెశాడని టాక్. బాహుబలి ప్రపంచాన్ని మూడు పార్టులకు మించి తీసుకువెళ్తానని జ‌క్క‌న్న కొద్ది రోజుల క్రింద‌ట ప్ర‌క‌టించ‌డంతో ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

No comments:

Post a Comment