పవన్ కళ్యాణ్ చేయబోతున్న మరో భారి మల్టీ స్టార్ సినిమా ఇదే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆప్త మిత్రుడు. వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరి కోసం ఒకరు పలు సార్లు సాయం చేసుకున్నారు. తాజాగా త్రివిక్రమ్‌కు మద్దతుగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అ ఆ’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాలో ఒక చిన్న ముఖ్య పాత్రలో పవన్ కళ్యాణ్‌ను నటింపజేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడు. అందుకు పవన్ సైతం ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. నితిన్, సమంత జంటగా తెరకెక్కుతున్న ‘అ ఆ’ చిత్రంలో పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడు అంటూ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ వల్ల ఆ సినిమా స్థాయి రెట్టింపు అవ్వడం ఖాయం. అతి త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సెట్‌లోనే ‘అ ఆ’ చిత్రానికి సంబంధించిన ఒక సీన్‌ను తెరకెక్కించే అవకాశాలున్నాయి. అందుకోసం ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి. ఒక్క రోజును పవన్ ఈ చిత్రం కోసం కేటాయించాడు. త్రివిక్రమ్‌తో పాటు నితిన్ అంటే కూడా పవన్‌కు అభిమానం. అందుకే ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పి ఉంటాడు అని కొందరు అంటున్నారు.

No comments:
Post a Comment