Monday, 11 January 2016

నిహారిక గ్లామ‌ర్ షోతో మెగా ఫ్యాన్స్ షాక్‌

tt450142501

మెగా వారసురాలు నిహారిక సినిమాల్లో నటిస్తుంది అన్న వార్త బ‌య‌ట‌కు రాగానే ర‌క‌ర‌కాల వార్త‌లు మీడియాలో వ‌చ్చేశాయి. నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌డం చిరుకు, చెర్రీకి న‌చ్చ‌లేద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎట్ట‌కేల‌కు నాగ‌బాబు కూడా కొన్ని కండీష‌న్లు పెట్టి ఆమె సినిమాల్లో న‌టించేందుకు ఓకే చెప్పార‌ని వార్త‌లు వ‌చ్చాయి. నిహారిక సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఉన్న క్యారెక్ట‌ర్ల‌లోనే న‌టిస్తుంద‌ని…ఎక్స్‌పోజింగ్‌, గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్ల‌కు ఆమె దూర‌మ‌ని రూమ‌ర్లు వినిపించాయి.

అయితే తాజాగా ఆమె న‌టిస్తున్న ”ఒక మనసు” సినిమాలో స్టిల్స్ చూస్తే నిహారిక‌ గ్లామర్ గా కనిపించి మరింత షాక్ ఇచ్చింది . పిక్కల పైదాకా వేసిన షార్ట్ లో నిహారిక దర్శనం ఇచ్చి కుర్రకారుని షాక్ కి గురి చేసింది. రామరాజు దర్శకత్వంలో ఆమె న‌టిస్తున్న ”ఒక మనసు” సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. తాజాగా రిలీజ్ అయిన స్టిల్స్‌లో ఆమె షార్ట్‌లో క‌నిపించ‌డంతో పాటు సినిమాలో ఆమె మ‌రిన్ని సీన్ల‌లో మ‌రీ కాక‌పోయినా ఓ రేంజ్‌లో గ్లామ‌ర్ ఒల‌క‌బోసిన‌ట్టు టాక్‌.
నిహారిక పిక్క‌ల దాకా షార్ట్ వేసుకున్న‌ స్టిల్ ఒకటి ఇప్పుడు బయటకు రావడంతో ఇది ఇప్పుడు పెద్ద సంచలనం అయ్యింది . నిహారిక షార్ట్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక మెగా ఫ్యాన్స్ అయితే నిహారిక స్టిల్ చూసి ఖంగుతింటున్నారు. తొలి సినిమాతోనే ఈ అమ్మ‌డు ఇలా రెచ్చిపోతే ఎలా అని వారు అవాక్క‌వుతున్నార‌ట‌.
please share it..

No comments:

Post a Comment