వివిధ జిల్లాల్లో ఉన్న వైకాపా నాయకులు ఇప్పుడు తెగ ఇబ్బందులు పడుతున్నారు. అసలే కేసులు, అరెస్టులతో సతమతమవుతున్న నేతలకు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. అది కూడా
అధికార పార్టీ నేతలతో కాదట. సొంత పార్టీ అధినేత జగన్‌తో. అదేంటి అనుకుంటున్నారా? అవును జగన్
వల్ల నేతల జేబులకు చిల్లులు పడుతున్నాయట. ఇందుకు కారణం అధినేత పర్యటనలేనట.
వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జిలకు, ఆ పార్టీ తరపున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కొత్త దిగులు మొదలైంది. ఈ మధ్య కాలంలో వివిధ నియోజకవర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుగుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి. మరి అధినేత ఈ విధంగా టూర్లకు వచ్చినప్పుడు అయ్యే ఖర్చును భరించాల్సింది నియోజకవర్గ ఇన్ చార్జీలే కదా! రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయిన ప్రస్తుత నేపథ్యంలో వైకాపా అభ్యర్థుల పాలిట ఈ ఖర్చు భారంగా మారుతోందట. ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాలతో ముడి పడి ఉండటంతో వీరికి ఈ భయం మొదలైంది.
ఒకసారా రెండు సార్లా.. కొన్ని నియోజకవర్గాల్లో జగన్ రెడ్డి ఇప్పటికే నాలుగైదు సార్లు పర్యటించిన సందర్భాలున్నాయి. మరి ఈ సందర్భంలో వివిధ ఏర్పాట్లకు ఖర్చు చేయాల్సి వస్తోందట. ఈ భారమంతా ఇన్‌చార్జిల మీదే పడుతోంది. దీంతో పార్టీ ఇన్ చార్జిల జేబులు ఖాళీ అవుతున్నాయి. దీంతో కక్కలేని మింగలేని పరిస్థితిలో వైకాపా ఇన్ చార్జిలు పడిపోతున్నారట. ఒకవైపు ఎన్నికలకి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది. ఇప్పటి నుంచి ఇలా ఖర్చులు పెట్టుకోవడం మొదలైతే.. ఎన్నికల నాటికి తాము చప్పబడి పోతామని.. వాళ్లు గగ్గోలు పెడుతున్నారట. జగన్ టూర్ల దెబ్బలకు తమ జేబులు గుల్ల అవుతున్నాయని వారు ఇంటర్నల్‌గా వాపోతున్నారట. అసలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిధుల కటకట ఉంటుంది.. మొన్నటి ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. మరి జగన్ వాళ్ల పరిస్థితి అర్థం చేసుకుంటాడో లేదో! చూడాలి.
No comments:
Post a Comment