ఏదైనా వస్తువు కొంచెం తక్కువ ధరలో వస్తోందంటే చాలు.. ఎగబడి పోతుంటారు! ఇతరుల కంటే ముందే దానిని సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు! ప్రజల ఆలోచనా విధానాన్ని గమనించి.. వారిని ఆకర్షించేందుకు కంపెనీలు కొత్త కొత్త ఐడియాలు వేస్తూ ఉంటాయి. లాభాలు గడిస్తుంటాయి! కానీ ఆ లాభాలు మాత్రం వినియోగదారులకు కనిపించవు! ఆఫర్ మోజులో పడి మునిగిపోతుంటారు. ఇప్పుడు ఇలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చింది ఒక మొబైల్ కంపెనీ! కేవలం 251 రూపాయలకే స్మార్ట్‌ఫోన్ అంటూ ప్రకటించేసింది. ఇంకేముంది జనాలు దానిని కొనేందుకు ఎగబడ్డారు! అదీ ఎంతలా అంటే గూగుల్‌ను తలదన్నీ రీతిలో.
ఫిబ్రవరి 18 వ తేదీన గూగల్ ఆధిపత్యాన్ని ఓ మొబైల్ కంపెనీ వెబ్ సైట్ బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే అతి చౌకైన స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించిన వెంటనే ప్రపంచంలోని యువత చూపు మొత్తం ఆ కంపెనీ వెబ్ సైట్ వైపు మరలింది. ప్రపంచంలో ఇంత తక్కువ ధరకు అడ్వాన్స్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ దొరకడం అంత సులభం కాదు! ఫ్రీడమ్ 251 బుకింగ్ 18 వ తేది ఉదయం 6 గంటల నుంచి 21 వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించింది.
18 వ తేదీ ఉదయం కోసం ప్రపంచంలోని యువత ఆసక్తిగా ఎదురు చూసింది. ఉదయం కాగానే ఒక్కసారిగా యువత సైట్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. ఇంత భారీ లోడ్ ను సర్వర్లు తట్టుకోలేకపోయాయని.. దీంతో సైట్ క్రాష్ అయిపోయింది. ఎంతలా అంటే.. సెకనుకు ఆరులక్షల హిట్స్ వచ్చాయి. ఇంత భారీగా సెకనుకు 6 లక్షల హిట్స్ సెర్చ్ ఇంజిన్ గూగల్ సంస్థకు కూడా రావట. గూగుల్ కు సెకనుకు 40వేల హిట్స్ మాత్రమే వస్తాయి. దీనిని బట్టి చూస్తే.. గూగుల్ కు 15 రెట్లు అధికంగా హిట్స్ ఫ్రీడమ్ 251 కి వచ్చాయన్నమాట. భవిష్యత్తులో ఇంత భారీగా మరే సైట్ కి రాదనీ కూడా సాంకేతిక నిపుణులు చెప్తున్నారు.
No comments:
Post a Comment