Friday, 19 February 2016

ఇప్పటి వరకూ 90 కోట్ల బిజినెస్..ఇంకా లెక్క తెలియాలి!

48045410804510

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. మరోవైపు సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ అయ్యాయి. డబ్బింగ్ పనులని సైతం త్వరలోనే స్టార్ చేయనున్నారు. మరో వైపు బిజినెస్ కి సంబంధించిన వ్యవహారాలు కూడ చకచకా పూర్తవుతున్నాయి. బయ్యర్లు సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీని భారీ రేటుకి కొంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్…అలాగే సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ స్టోరీపై బిజినెస్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి.
ఇక డిస్ట్రిబ్యూటర్లు లెక్క లేకుండా మ్యాగ్జిమం రేటుకి ఏరియా రైట్స్ కొనేసుకుంటున్నారు. సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీకి సంబంధించిన రెండు టీజర్స్‌ వచ్చినా ఇప్పటికీ కథేంటో అస్సలు బయటికి రాలేదు. కేవలం పవన్‌ కళ్యాణ్‌ ఉన్నాడన్న ఒక్క కారణంతోనూ అందరూ ఈ మూవీని బారీ రేట్లకి కొంటున్నారు. ఇక ఈ మూవీ ఇప్పటి వరకూ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ గా 90 కోట్లకు చేరింది. ఇంకా ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ పూర్తిగా జరగాల్సి ఉంది. ఈ లెక్క ఇంకొంచెం పెరిగి 110 వరకూ చేరుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే జరిగితే నిజంగా సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ రికార్డ్ ని క్రియేట్ చేసినట్టే అని అంటున్నారు.

No comments:

Post a Comment