సినిమా: కృష్ణాష్టమి
నటీనటులు: సునీల్, డింపుల్ చోపడే, నిక్కీగల్రానీ, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, కబీర్ దుహాన్ సింగ్, పోసాని కృష్ణమురళీ, ముఖేష్ రిషీ, సప్తగిరి, సుమన్ తదితరులు.
సంగీతం: దినేష్ కనకరత్నం
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: వాసు వర్మ
రన్ టైం: 134 నిమిషాలు
సెన్సార్ రిపోర్ట్: యూ/ఏ
రిలీజ్ డేట్: 19 ఫిబ్రవరి, 2016

కమెడియన్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్లు కొట్టాడు సునీల్. అయితే వరుస హిట్ల తర్వాత కథ జడ్జిమెంట్‌లో వేసిన రాంగ్ స్టెప్పులతో వరుస ప్లాపులు ఎదుర్కొన్నాడు. ఇక సునీల్ హీరోగా సినిమా వచ్చి చాలాకాలం అయింది. దీంతో చాలా గ్యాప్ తీసుకుని మరీ ఈ కృష్ణాష్టమిని తెరకెక్కించారు. ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం నాగచైతన్య ఎంట్రీ మూవీ జోష్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వాసూవర్మ దర్శకత్వం వహించిన కృష్ణాష్టమి సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మించాడు. సునీల్ మినిమమ్ గ్యారంటీ హీరోగా… మాస్‌లో ఒక ఫాలోయింగ్‌ను సంపాదించుకోవాలంటే ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలి. సునీల్ కేరీర్‌కు అగ్నిపరీక్ష లాంటి సినిమా అయిన కృష్ణాష్టమి ఎంత వరకు విజయం సాధించింది. ఈ సినిమా సునీల్ కేరీర్‌ను టర్న్ చేసిందా…లేదా అన్నది డెక్కన్‌రిపోర్ట్.కామ్ సమీక్షలో చూద్దాం.
స్టోరీ:
కృష్ణవరప్రసాద్ (సునీల్) చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతో అతడిని పెదనాన్న ఫారిన్‌లో ఉంచి చదివిస్తుంటాడు. కృష్ణకు ఇండియాకు రావాలని..తనవాళ్లను చూడాలని ఎంతో కోరిక ఉంటుంది. 18 సంవత్సరాలుగా తన వాళ్లకు దూరంగా ఉన్న కృష్ణ ఇండియా రాకుండా అడ్డుపడుతున్న పెదనాన్న అక్కడే ఓ ఎన్నారై అమ్మాయితో కృష్ణకు పెళ్లి సెటిల్ చేస్తాడు. ఇండియా రావాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న కృష్ణ పెదనాన్నకు తెలియకుండా ఫ్రెండ్ గిరి (సప్తగిరి)తో కలిసి ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తాడు.

ఇండియా వచ్చే క్రమంలో మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం యూరోప్ లో దిగిన కృష్ణ, అక్కడ పల్లవి(నిక్కి గల్రానీ)ని తొలి చూపులోనే ప్రేమించి, తిరిగి ఫ్లైట్ ఎక్కేలోపు తనని కూడా ప్రేమలో పడేస్తాడు. కృష్ణ ఇండియాలో దిగగానే అతడి మీద ఎటాక్ జరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో కృష్ణ తనకు ఎయిర్‌పోర్టులో పరిచయం అయిన అజయ్‌కుమార్(అజయ్) స్థానంలో వాళ్ల ఫ్యామిలీలో ఎంట్రీ ఇస్తాడు. ఆ ఇంటి పెద్ద తన కుమార్తె (డింపుల్ చోపడే)ని అజయ్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని తెలుసుకున్న కృష్ణ, అజయ్ గా తాను ఆడుతున్న అబద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటాడు. తాను అజయ్‌ను కాదని ఇంట్లో ఉత్తరం రాసి పెట్టి వెళ్లిపోయే ప్రయత్నంలో మరోసారి కృష్ణపై ఎటాక్ జరుగుతుంది. అసలు కృష్ణను చంపాలనుకుంటుంది ఎవరు..? అజయ్ కుటుంబానికి కృష్ణకు ఉన్న సంబందం ఏంటి..? కృష్ణను అతడి పెదనాన్న ఇండియా రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు..? ఈ ప్రశ్నలకు సమాధానమే కృష్ణాష్టమి సినిమా స్టోరీ.
నటీనటుల పెర్పామెన్స్:
వరుస ప్లాపులతో కేరీర్ పరంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న సునీల్ ఈ సినిమా కోసం చాలా బాగానే కష్టపడ్డాడు. యాక్షన్ సీన్లు, బిల్డప్ షాట్లతో మాస్ హీరో ఇమేజ్ కోసం బాగానే కష్టపడ్డాడు. అయితే సునీల్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా అతడిని ఓ యాక్షన్ హీరోగా ప్రేక్షకులు మాత్రం చాలా చోట్ల రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇక కామెడీ, డ్యాన్సుల్లో మాత్రం బెస్ట్ అనిపించాడు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా వారు నటించేందుకు స్కోప్ లేదు. గ్లామర్ షోతో ఆకట్టుకునేందుకు ట్రై చేశారు. ఎప్పుడు నెగెటివ్ పాత్రలో కనిపించే ముఖేష్ రుషి, పాజిటివ్ పాత్రలోనూ మెప్పించాడు. అషుతోష్ రాణా విలన్ గా ఆకట్టుకున్నాడు. సప్తగిరి, పోసాని కృష్ణమురళిల కామెడీ బాగానే వర్క్ అవుట్ అయింది. సెల్పీ పిచ్చి ఉన్న క్యారెక్టర్ లో కనిపించిన బ్రహ్మనందం మరోసారి డిజాస్టర్ పెర్సామెన్స్ చేశాడు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్:
సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీలో యూరప్, ఇండియాలోని లొకేషన్లు బాగా చూపించారు. దినేష్ కనకరత్నం సంగీతం ఓకే. ఇక దిల్ రాజు నిర్మాణ విలవలు రిచ్‌గా ఉన్నాయి. సాంగ్స్, ఫైట్స్, ఫారిన్ లొకేషన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు.

వాసు వర్మ డైరెక్షన్ కట్స్:
ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం ఇదే దిల్ రాజు బ్యానర్‌లో నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ సినిమాను తెరకెక్కించిన వాసు వర్మ ఆ సినిమాను పసలేని కథనంతో ప్లాప్ సినిమాగా తెరకెక్కించేశాడు. తన నెక్ట్స్ మూవీ కోసం వాసు వర్మ ఏడు సంవత్సరాలు వెయిట్ చేసినా ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో మరోసారి అతడిమీద నమ్మకంతో దిల్ రాజు రెండో ఛాన్స్ ఇచ్చాడు. ఈ రెండో అవకాశాన్ని కూడా వాసు వర్మ సరిగ్గా ఉపయోగించుకులేదని సినిమా చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.

హీరోను తీసుకెళ్లి విలన్ల ఇంట్లో పెట్టి వాళ్లను మార్చడం అనే పరమ రొటీన్ కాన్సెఫ్ట్‌నే మరోసారి తీసుకున్న వర్మ పరమ చెత్త కథనంతో సినిమాను ప్లాప్ చేసేశాడు. ఫస్టాఫ్ కాస్త సోలోగా కథను నడించినా సెకండాఫ్ లో మాత్రం సినిమాను స్పీడప్ చేశాడు. ఇక అల్లు అర్జున్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో కోసం రాసుకున్న కథను సునీల్ లాంటి కామెడీ హీరోతో తీయడం కూడా పెద్ద రాంగ్ స్టెప్. కొన్ని సీరియస్ మోడ్ ఉన్న సీన్లలో సునీల్ నటన చూస్తే కామెడీగా అనిపిస్తుంది. సెకండాఫ్‌ను వాసువర్మ గత హిట్ సినిమాల్లోని సీన్లను తెచ్చి పేర్చినట్టు కూడా కనపడుతుంది.
ఫ్లస్‌లు(+)
– కామెడీ
– సినిమాటోగ్రఫీ
– నిర్మాణ విలువలు
– కామెడీ
– సినిమాటోగ్రఫీ
– నిర్మాణ విలువలు
మైనస్‌లు (-)
– అరిగిపోయిన కథ
– ఫస్టాఫ్
– పాటలు
– సునీల్‌కు సెట్ కాని స్టోరీ
– పరమ బోరింగ్ కథనం
– డైరెక్షన్
– అరిగిపోయిన కథ
– ఫస్టాఫ్
– పాటలు
– సునీల్‌కు సెట్ కాని స్టోరీ
– పరమ బోరింగ్ కథనం
– డైరెక్షన్
ఫైనల్‌గా….
పరమ రొటీన్ రొట్ట కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన కృష్ణాష్టమి సునీల్ కేరీర్‌లో మరో డిజాస్టర్ మూవీగా మిగిలే ఛాన్సులే ఉన్నాయి. ఈ వారం ఈ సినిమాకు వెళ్లి తలనొప్పి తెచ్చుకోవడం కంటే నెక్ట్స్ వారం వచ్చే మరో మంచి మూవీ కోసం వెయిట్ చేయండి. సునీల్ బెస్టాఫ్ లక్ నెక్ట్స్ మూవీ.

కృష్ణాష్టమి మూవీ డెక్కన్ రిపోర్ట్ .కామ్ రేటింగ్: 2 ★★
No comments:
Post a Comment