ప్రధాని నరేంద్ర మోడీకి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని తృణమూల్ ఎంపీ ఇద్రిస్ అలీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలను షాక్‌కు గురిచేశాయి. “లాహోర్‌లో ప్రధాని మోడీ పర్యటించిన వెంటనే పఠాన్ కోట్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడడంలో అర్ధమేమిటి ? మోడీకి ఉగ్రవాదులతో లింకులున్నాయని అనుకోవాల్సిందే కదా” అని
ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీ హోదాలో ఉండి కూడా దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి బాధ్యతారాహిత్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్రిస్ అలీ వ్యాఖ్యలతో పార్టీకేమి సంబంధం లేదని ప్రకటించిన ఆ పార్టీ , ఆ వ్యాఖ్యలను ఆయన వ్యకిగతమని తేల్చి చెప్పింది. అంతేకాక విచక్షణ మరిచి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇద్రిస్ అలీని వివరణ కోరనున్నట్టు తృణమూల్ నేత డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల మెరుపుదాడి యావత్తు దేశాన్ని షాక్‌కు గురి చేసింది. నాలుగు రోజుల కిందట చోటుచేసుకున్న ఈ దాడితో మంగళవారం వరకు పఠాన్‌కోట్‌లో కాల్పులు మార్మోగాయి. అయితే బుధవారం ఉదయం అక్కడ కాల్పుల మోత ఆగిపోయి పరిస్థితి సద్దుమణుగుతుందనుకున్న టైంలో కోల్‌కతాలోని తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలు మరోసారి దేశ ప్రజలను షాక్‌కు గురిచేశాయి. దేశ ప్రజలందరూ భయబ్రాంతులవుతున్న టైంలో ఇలాంటి సీరియస్ విషయంలోనూ సదరు ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అలీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, కార్యకర్తల నుంచి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
please share it..
No comments:
Post a Comment