Thursday, 7 January 2016

టీఆర్ఎస్ వ‌ల్లే హైద‌రాబాద్‌లో ఉగ్ర‌వాదం

4501450102

గ్రేట‌ర్‌లో మాట‌ల వేడి పెరుగుతోంది.. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాలని చూస్తున్న కాషాయ ద‌ళం కూడా ప్ర‌చారం ఉధృతం చేసింది. ప్ర‌ధాని మోడీపై ఉన్న క్రేజ్‌ను సాధ్య‌మైనంతగా ఉప‌యోగించుకోవాల‌ని యోచిస్తోంది. అలాగే తెలంగాణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, నిధులు విడుద‌ల చేయ‌డం లేద‌ని టీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ధీటుగా స‌మాధాన‌మిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌మంత్రులు రంగంలోకి దిగుతున్నారు.. టీఆర్ఎస్‌పై విమర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్లు చేశారు.
ప్ర‌స్తుతం దేశాన్ని ఉగ్ర‌వాదం వ‌ణికిస్తోంది.. ఐఎస్ ఓ వైపు త‌న రాజ్యాన్ని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. నిరుద్యోగ యువ‌తే ల‌క్ష్యంగా త‌మ‌లో చేర్చుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌కు చెందిన ముగ్గురు యువ‌కులు ఐఎస్‌లో చేరేందుకు ప్ర‌య‌త్నించారు. పోలీసులు వారిని నాగపూర్‌లో అరెస్టు చేశారు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయింద‌ని కేంద్ర‌మంత్రి హ‌న్స్ రాజ్ గంగారామ్ విమ‌ర్శించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫల్యం, అల‌స‌త్వం వ‌ల్లే హైద‌రాబాద్‌లో ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ఐఎస్ చొర‌బ‌డింద‌ని ఆరోపించారు. ప్రభుత్వపరంగా, ఇతరత్రా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్లే యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని గంగారామ్ దుయ్య‌బ‌ట్టారు. దేశం అంతా సర్దార‌్ వల్లభ్ బాయ్ పటేల్ ను పొగుడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నిజాం ను పొగుడుతారని ఆయన వ్యాఖ్య‌నించారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ నేత‌లు ఏవిధంగా స్పందిస్తారో.
please share it..

No comments:

Post a Comment