Thursday, 7 January 2016

మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్‌కు ఐసిన్ వార్నింగ్‌

05401201010

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఐసిస్‌ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేర ఐసిస్‌ ట్విట్టర్‌లో అసదుద్దీన్‌ను హెచ్చరించింది. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు
ఉంటాయని ఐసిస్ ఎంపీకి వార్నింగ్ ఇచ్చింది. తాము భారత్‌లోనూ విస్తరిస్తామని  ఐసిస్‌ పేర్కొంది. ఐఎస్ఐఎస్ గురించి తెలియకపోతే నోరు మూసుకోవాలని ట్విట్టర్‌లో బెదిరింపు వచ్చింది. త్వరలోనే భారతదేశంలో కూడా దాడులు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది.
గతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను రేపిస్టులు, హంతకులుగా అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. యువకులను కూడా ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని ఇటీవల పలు బహిరంగ సభలలోనూ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. దీంతో ఐఎస్ఐఎస్ ఆయనకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఐఎస్ఐఎస్ తాజా బెదిరింపులపై అసదుద్దీన్ స్పందించారు. ఐఎస్ఐఎస్ ఇస్లాం మతానికి వ్యతిరేకమని, ఆ ఉగ్రవాద గ్రూపు ఎన్ని బెదిరింపులు చేసినా తాను భయపడబోనని ఆయన స్పష్టం చేశారు.
please share it..

No comments:

Post a Comment