మోడీకి పెళ్లైందో లేదో మొన్నటిదాకా మీమాంస.గురుడు ఎన్నికల అఫిడవిట్ దాఖలు
చేసేవరకూ ఆయనకో భార్య ఉందని, ఆమె పేరు జసోదాబెన్ అని మనలో ఎవ్వరికీ తెలియదు.మోడీకి భార్యే కాదు కూతురు కూడా ఉందట! ఆమె ఎవరో కాదు క్యాలెండర్ గాళ్, మోడల్ అవానీమోడీ. ఐతే.. ఈమె అచ్ఛంగా మోడీ కూతురు కాదు గానీ.. ఈ ఇద్దరి ఇంటిపేరూ ఒక్కటి కావడం..ఈమెది కూడా గుజరాతే కావడంతో గతంలో ఎన్నడూ లేనంత హైప్ ఈ వార్తకు వచ్చేసింది. ” నేను నరేంద్ర మోడీ కుమార్తెను ” అని సరదాగా మీడియాతో ఆమె చేసిన కామెంటే ఇంతటి సంచలనానికి కారణమైంది.అమ్మడికి ఎన్నడూ లేని ఇమేజ్‌నూ.. క్రేజ్‌నూ తెచ్చిపెట్టింది.ఈ మోడల్ బేబీ ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి మీడియా పీపుల్ ” మీరు నరేంద్ర మోడీకి బంధువులా..? చుట్టాలా? ” ఇలా తోచిన రీతిలో గుక్కతిప్పుకోక ప్రశ్నలు గుప్పిస్తుండడంతో ఆఖరికి అమ్మడు అసలు విషయం చెప్పేసింది. ” నేను మోడీ కూతురినే.. నేనే కాదు ఈ దేశంలో అమ్మాయిలందరికీ ఆయనే తండ్రి. ఇందులో సందేహమేముంది..” అంటూ అవానీ మోడీ తనదైన చమక్కు అందించింది.చురుక్కుమనిపించింది.మొత్తానికి ఈ పబ్లిసిటీ స్టంట్ అవానీకి బాగానే కలిసొచ్చింది.అన్నట్లు ఈ అమ్మడి డెబ్యూ మూవీ ఇటీవలే విడుదలైంది.
మోడీ మామ .. సినిమా చూపిస్తుండు : వాట్ ఏ వండర్
అంతేకాదు! మోడీ ప్రధాని అయ్యాక ఆయన సామాజికవర్గానికి చెందిన వారికి యమ క్రేజ్ వచ్చేసింది.. అని చెప్పడం వింతే కాదు! శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాల్లో సైతం ఆయన సామాజికవర్గానికి చెందిన వారు ఉండడం.. వారినీ ప్రజలు ఇలానే కొంచెం వింతగా ప్రశ్నిస్తుండడం ఇటీవల ఓ ఆనవాయితీగా మారింది.ఏదైతేనేం మోడీనా మజాకానా… ? గుజరాత్‌లో మోడీలకు.. ఒడిశాలో సాహులకు.. ( ఒడిశాతో సరిహద్దు పంచుకునే శ్రీకాకుళం లాంటి ఉత్తరాంధ్ర జిల్లాలకు) కొంచెం దగ్గర బంధమేదో ఉన్నట్టే ఉంది.అదెలా అన్నది ఇప్పటికిప్పుడు కచ్చితంగా చెప్పలేం కానీ.. మోడీ ఈజ్ గ్రేట్ అని మాత్రం సుస్పష్టం చేయగలం.ఎందుకంటే ఓ ఛాయ్‌వాలా.. ఈ దేశ ప్రధాని అయ్యిండు గనుక.కేవలం ట్విటర్ మాధ్యమాన్నే వినియోగించుకుని తనకుంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న క్రియేటివ్ పర్సన్ గనుక.అందుకనో / ఇంకెందుకనో మోడీ మామ మనకు (అంటే కుర్రకారుకు) అని అర్థం సినిమా చూపిస్తుండు. చూస్తుంటే.. ఐ యామ్ మలాలా పుస్తకం తరహాలోనే ఐ యామ్ అవానీ .. డాటర్ ఆఫ్ మోడీ అనే పొత్తం వచ్చునేమో!
please share it..
No comments:
Post a Comment