Thursday, 7 January 2016

కొత్తింట్లో చంద్రబాబు

chandranna-new-

కొత్తింట్లో చంద్ర‌య్య అడుగు పెట్టేశాడు. ఆయ‌న రాకను గుర్తించి, స్వాగ‌తించి వాన‌మ్మ కూడా.. దీవెన‌లందించింది.భారీ వ‌ర్షం కురిపించి నేల‌మ్మ‌ను పుల‌కింప‌జేసింది.గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలో కృష్ణానది కరకట్టను ఆనుకొనివున్న లింగమనేని గ్రూపునకు చెందిన అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి నివాసాన్ని అధికారులు సర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రోడ్డుమార్గంలో ఈ ఇంటికి చేరుకున్నారు.
మార్పులూ.. చేర్పులూ : బై భువ‌నేశ్వ‌రి
ఐదు బెడ్‌రూమ్‌లతో కూడిన ఈ హౌస్‌లో చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి తమ టేస్ట్‌కు అనుగుణంగా మార్పులు చేయించుకుంటున్నారు. తనకు అధికారం ఇచ్చిన ప్రజలకు చేరువగా ఉండాల‌ని అనుకుంటున్నట్టు చంద్రబాబు ఎప్ప‌టి నుంచో చెబుతూ వ‌స్తున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌లో భాగంగా..వారంలో ఒక రోజు, అదీ వీలు కుదిరితేనే హైదరాబాద్‌లో త‌న కుటుంబంతో గడుపగ‌లుగుతున్నారు. ఇకపై విజయవాడలో ఉన్నన్ని రోజులూ ఆయన ఇక్కడే ఉండనున్నారు. ఇంటి పనులు జరుగుతుండగానే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆగస్టు 29న ఈ ఇంట్లో పాలు పొంగించిన విషయం తెల్సిందే! ఆ తర్వాత సీఎం దంపతులు ఈ ఇంట్లోకి అడుగిడ‌డం ఇదే తొలిసారి. చిన‌బాబు లోకేశ్ కూడా కృష్ణాజిల్లాలో త‌నకంటూ ఓ సొంత కార్యాల‌యాన్ని ఏర్పాటుచేసుకునేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.ఇక ఇక్క‌డి నుంచే కార్య‌క‌లాపాలు నిర్వరిస్తూ.. శ్రేణుల‌కు దిశానిర్దేశం చేస్తూ.. ఆన్‌లైన్ మీడియాలోనూ పార్టీ వాయిస్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌ర్థ‌నీయంగా వినిపిస్తూ.. ప‌సుపు దండును బ‌లోపేతం చేయాల‌న్న‌ది ఆయ‌న భావ‌న‌.
please share it..

No comments:

Post a Comment