మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ సర్జరీని చేయించుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. చిరంజీవి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పటిల్ లో తన భుజానికి సంబంధించి సర్జరీ చేయించుకున్నట్లు ఈ వార్తల కథాంశం. ఇక డాక్టర్స్ సలహా మేరకు దాదాపు ఒక వారం విశ్రాంతి అవసరం అని కూడ అన్నారంట. దీంతో చిరంజీవి ఫిబ్రవరి రెండవ వారంలో హైదరాబాద్ కు తిరిగివస్తాడు.తను తన 150వ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో త్వరలోనే పాల్గొనబోతున్నాడు. ఇందుకు చిరంజీవి అన్ని విధాలుగా ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. చిరంజీవి సర్జరీ వార్తలపై మెగా అభిమానులు ఆందోళన పడుతున్నారు. ‘కత్తి’ రీమేక్ విషయంలో చిరంజీవి తన నటనపై పూర్తి దృష్టి పెట్టినట్టాడు. గతంలో చిరంజీవి ఏ విధంగా ఉండేవాడో, ఇప్పుడు కూడ చిరంజీవి ఆ విధంగానే కనిపించేందుకే ఈ తాపత్రయం అంట. అయితే చిరంజీవి ప్రస్తుతం ఆన్ స్క్రీన్ లుక్ లో కొద్దిగా ఫ్యాట్ ఉన్న బాడీతో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం జరిగిన సర్జరీలో భాగంగానే తను ఫ్యాట్ ని సైతం తీయించుకుంటున్నాడని అంటున్నారు. దీని కారణంగా చిరంజీవి దాదాపు 6 కేజీల వరకూ బరువు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విధంగా చిరంజీవిపై వస్తున్న వార్తల్లో నిజం ఎంత వరకూ ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు.
Thursday, 4 February 2016
చిరు సర్జరీ చేయించుకున్నాడా?

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment