ప్రముఖ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరికి చెందిన థియేటర్లను ఆంధ్రాబ్యాంకు అధికారులు
సీజ్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయనకు ఉన్న బొమ్మరిల్లు, మినీ బొమ్మరిల్లు థియేటర్లను బుధవారం ఆంధ్రాబ్యాంకు అధికారులు సీజ్ చేశారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో చౌదరి తీసిన రేయ్ సినిమా ఆయనకు భారీగా నష్టాలు మిగిల్చింది. ఈ సినిమాను రూ.30 కోట్ల భారీ బడ్జెట్‌తో చౌదరి తెరకెక్కించడంతో సినిమా ప్లాప్ అవ్వడంతో చౌదరికి భారీ నష్టాలు తప్పలేదు.
ఈ సినిమా కోసం గుడివాడలో ఆయనకు చెందిన రెండు థియేటర్లతోపాటు చేపల చెరువులు తనఖాపెట్టి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించని కారణంగా బుధవారం థియేటర్లకు నోటీసులు అందించి గేట్లకు తాళాలు వేశారు అధికారులు. ఆయన దాదాపు 14 కోట్ల వరకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేయ్ సినిమా కోసం చౌదరి రూ.10 కోట్లు తీసుకోగా చివరకు వడ్డీకి వడ్డీ పెరగడంతో 10 కోట్లు కాస్తా 14 కు చేరింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేసి, థియేటర్‌ని సీజ్ చేసినట్టు సమాచారం.
No comments:
Post a Comment