Thursday, 4 February 2016

సోలార్ స్కామ్ కాదు సెక్స్ స్కామ్‌

047804501201

కేర‌ళ రాష్ట్రంలోని సోలార్ స్కామ్‌లో అవినీతి -డబ్బు వ్యవహారాలకే పరిమతం కాకుండా అనేక సెక్స్ ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయి. సోలార్ ప్రాజెక్ట్‌ను అడ్డం పెట్టుకొని సరితా నాయర్‌తో మంత్రులు చేసిన రహస్య సంభాషణలు, అమ్మాయిల వ్యవహారాలు..ఇలా ఇందులో ఎన్నో కోణాలు ఉన్నాయి. సీఎంతో పాటు కొంతమంది సరితా నాయర్‌తో ఏకాంతంగా గడిపారంటూ వస్తున్న వార్తలు… కుంభకోణం వెనుకున్న పొలిటికల్ మాఫియాకు అద్దం పడుతున్నాయి. సరితా నాయర్ కాల్‌ లిస్ట్‌ను డీ కోడ్‌ చేస్తే ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోలార్‌ ప్రాజెక్టు చూడటానికి పది కోట్ల రూపాయ‌ల కుంభకోణంగా కనిపిస్తున్నా… లోతుల్లోకి వెళ్లే కొద్దీ మైండ్ బ్లాంక్ అయ్యే వ్యవహారాలుబయటపడుతున్నాయి. ఈ కేసును విచారిస్తోన్న జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు నిందితులు ఇస్తున్న వాంగ్మూలాలు కొత్త విషయాలను బయటకు తెస్తున్నాయి.
సీఎం ఊమెన్ చాందీ, ఆయన పార్టీకి చెందిన ఐదుగురు ముఖ్య నేతలు సరితా నాయర్ తో ఏకాంతంగా గడిపినట్లు బిజు రాధాకృష్ణన్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి వీడియోలు కూడా ఉన్నట్లు కమిషన్‌కు చెప్పారు. అయితే బిజు రాధాకృష్ణన్‌తో పాటే అరెస్టైన సరితా నాయర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడితో మరో మహిళకు సంబంధాలున్నాయని… తనకు ఎలాంటి పాత్ర లేదని సరితా నాయర్ వాదిస్తోంది. ఇప్పటి వరకూ ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి గానీ, ఆయన కేబినెట్ సహచరులు గానీ నోరు మెదపలేదు. సోలార్ కుంభకోణంలో ముఖ్యమంత్రి, మంత్రులపై ఆరోపణలు రావడం న్యాయ విచారణలో సంచలన విషయాలు బయటపడంతో విపక్షాలు కేరళ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి.
సీఎం ఉమెన్ చాందీ మాట్లాడుతూ సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు లిక్కర్ మాఫియా సరితా నాయర్‌ను ప్రయోగించిందని ఆయ‌న‌ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూడీఎఫ్‌ కూటమికి సోలార్ కుంభకోణం పెద్ద మచ్చగానే మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారబోతోంది. సోలార్ హీట్ ఊమెన్ చాందీ సర్కార్‌కు ఏదో రకంగా తాకుతూనే ఉంటుంది.

No comments:

Post a Comment