ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ, హీరోయిన్ అనుష్కా శర్మల లవ్ బ్రేకప్ న్యూస్
ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు మూడేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తోంది. అయితే ఇంతలో సడెన్‌గా ఏమైందో తెలియదు కాని వీరి ప్రేమ బ్రేకప్ అయినట్టు న్యూస్ వస్తోంది. ఇన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాం.. ఇక పెళ్లి చేసుకుందాం.. అని విరాట్ ప్రతిపాదించాడని, అయితే పెళ్లికి అనుష్క ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని.. దీంతో వారిద్దరూ గొడవ పడి విడిపోయారన్న న్యూస్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది.
2016 సంవత్సరాంతానికి కళ్లా వివాహం చేసుకోవాలనేది విరాట్ ప్రతిపాదన. అయితే ఇప్పుడు అనుష్క అటు హీరోయిన్ గా , నిర్మాతగా బిజీగా ఉంది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఆమెకు లేదు.. విరాట్ మాత్రం ఇక పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు. దీంతోనే వారి మధ్య విబేధాలు రావడం.. ఇన్ స్టాగ్రమ్ లో విరాట్ అనుష్కను ఫాలో కావడం మానేయడం జరిగిపోయిందని.. వీరిని బాగా ఎరిగిన వాళ్లు చెబుతున్నారు. మరి ఇదే నిజం అయితే… పెళ్లి అంటే అబ్బాయిలు గాక అమ్మాయిలు మొహం చాటేసే రోజులు వచ్చేసినట్టేనేమో!
No comments:
Post a Comment