బీహార్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లయిన నెలకే తన భార్యను ఓ ప్రబుద్ధుడు పోర్న్ ఫిల్మ్ మేకర్స్‌కు
విక్రయించాడు. పెళ్లయి కనీసం నెలన్నర కూడా గడువక ముందే సంతలో వస్తువులా అమాయకురాలైన తన భార్యను రూ.7లక్షలకు పోర్న్ వీడియోలు తీసేవారికి అమ్మేశాడు. అదృష్టవశాత్తు ఆమె తన తోటికోడలు ద్వారా ఈ విషయం తెలుసుకొని పరుగుపరుగున రాత్రికి రాత్రే ప్రాణాలు అరచేతబట్టుకొని తన ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్‌లోని సరాన్ జిల్లాకు చెందిన తరయా అనే గ్రామానికి చెందిన యువతికి అదే రాష్ర్టానికి చెందిన టికు పాటికర్‌కు ఇచ్చి గత నెల 8వ తేదీన వివాహం చేశారు. అయితే పాటికర్ హర్యానాలో స్థిరపడ్డాడు. దీంతో భార్యను తీసుకుని హర్యానా వెళ్లాడు. ఆ యువతి కాపురానికి వెళినప్పటి నుంచి ఆ కుటుంబం రాచిరంపాన పెట్టడం ప్రారంభించింది. ఆమె తండ్రి రూపాయి కట్నం కూడా ఇవ్వలేదంటూ కొట్టడం ప్రారంభించారు. వాటన్నింటి ఆమె ఎంతో సహనంతో భరిస్తూ వచ్చింది. కానీ, ఇటీవల ఆమెకు గుండెలో దడపుట్టించే వార్త తెలిసింది.
ఆమెను తన భర్త పరాయివాళ్లకు అమ్మేశాడని, వారు కూడా నీలి చిత్రాలు తీసేవాళ్లకు అని తెలిసింది. తెల్లారితే ఆమెను వాళ్లు తీసుకెళతారని ఆ యువతి తోటికోడలు ఆమెకు చెప్పింది. దీంతో ఆమె రాత్రికి రాత్రే బీహార్‌కు వచ్చేసింది. జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment