Wednesday, 17 February 2016

ధోనీ మ‌న‌సుదోచిన ఏపీ న‌గ‌రం తెలుసా..?

645890450210

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక రాజ‌ధాని, సాగ‌ర న‌గ‌రం విశాఖ‌ప‌ట్నం క్రికెట్ కెప్టెన్ ధోనీ మ‌న‌సును ఆక‌ట్టుకుంది. ట్విట్ట‌ర్‌లో ఏకంగా విశాఖ‌ను ధోనీ మెచ్చుకున్నాడు. కెరీర్‌లోనే మంచి స్టోర్‌ను ఇచ్చిన విశాఖ వేదిక‌ను అంత తేలిక‌గా మ‌రిచిపోగ‌ల‌డా.. అందుకే గుర్తుపెట్టుకున్నాడు. త‌న మ‌న‌సుదోచుకున్న న‌గ‌రంలో విశాఖ ఒక‌టి అంటూ కితాబిచ్చాడు. స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్‌లో భాగంగా క్లీనెస్ట్ సిటీల జాబితాలో ఐదో స్థానాన్ని కైవ‌సం చేసుకున్న విశాఖ న‌గ‌రం ఇటీవ‌ల అంద‌రి మ‌నసునూ దోచేస్తుంది.
శ్రీ‌లంక‌తో ఆదివారం జ‌రిగిన మ్యాచ్ కోసం విశాఖ‌కు వ‌చ్చిన ధోనీ.. అక్క‌డి నుంచి వెళ్లిన త‌రువాత ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. “వైజాగ్ నుంచి తిరిగి వెళుతున్నా.. నేను నివ‌సించ‌డానికి ఇష్ట‌ప‌డే న‌గ‌రాల్లో ఇదొక‌టి. బీచ్‌తో పాటు అంద‌మైన, ఆక‌ట్టుకునే ప‌చ్చ‌ద‌నం విశాఖ‌ సొంతం”. నా మొద‌టి భారీ ఇన్నింగ్స్‌కు వేదిక కూడా విశాఖ‌నే. అని ధోనీ ట్వీటిచ్చాడు. 2005 ఏప్రిల్ 5న పాకిస్తాన్‌తో విశాఖ‌లో జ‌రిగిన మ్యాచ్‌లో 148 ప‌రుగులు చేసిన ధోనీ తొలి సెంచ‌రీని ఇక్క‌డే న‌మోదు చేశాడు. ఆ సెంచ‌రీతో ధోనీ “హెలికాప్ట‌ర్ షాట్” ప‌వ‌ర్ క్రికెట్ ప్రపంచానికి తెలిసి వ‌చ్చింది.

No comments:

Post a Comment