Wednesday, 17 February 2016

షేక్‌స్పియ‌ర్‌కు అక్ర‌మ సంతానం ..!

890450120120

విశ్వవిఖ్యాత రచయిత‌ విలియమ్‌ షేక్‌స్పియర్ పేరు తెలియ‌ని వారుండ‌రు. ఆయ‌న ర‌చ‌న‌లు ఇప్ప‌ట‌కీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమందికి మార్గ‌ద‌ర్శకంగా ఉంటున్నాయి. 16వ శతాబ్దానికి చెందిన ఈ బ్రిటిష్ రచయితకు అక్రమ సంతానం ఉందా? అంటే తాజా పుస్తకం ఔననే అంటోంది. ఈ లెజండరీ రచయితకు అక్రమ సంబంధం ద్వారా ఓ కొడుకు పుట్టాడని, అతని కోసం ఓ గేయాన్ని కూడా షేక్‌స్పియ‌ర్ రాశారని తాజా పుస్తకం వెల్లడించింది.
పిల్లాడిగా ఉన్నప్పుడు విలియమ్ డెవెనంట్‌ను ఉద్దేశించి ‘మై లవ్లీ బాయ్‌’ అంటూ సానెట్‌ 126ను షేక్‌స్పియర్ రాశారు. డెవెనంట్ పెరిగి పెద్దయిన తర్వాత ప్రముఖ రచయితగా పేరొందారు. ఈ ఇద్దరి ముఖాల్లో పోలికలు ఉండటం, కళ్లు ఒకేవిధంగా ఉండటంతో డెవెనంట్ షేక్‌స్పియర్ కొడుకు అయి ఉంటాడని తాజా పుస్తకం ‘షేక్‌స్పియర్స్ బాస్టర్డ్’లో పేర్కొన్నారు. షేక్‌స్పియర్ 400 జయంతి సందర్భంగా సిమన్ ఆండ్రూ స్టిర్లింగ్ డెవెనంట్ ఆత్మకథగా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు.
షేక్‌స్పియర్ డెవెనంట్ తండ్రి అని, అయితే అప్పటి పండితులు వారిద్దరిని అణచివేశారని అప్పటి వదంతుల ప్రకారం తెలుస్తున్నద‌ని రచయిత ఈ పుస్తకంలో పేర్కొన్నాడు. నిజానికి షేక్‌స్పియర్‌కు తన భార్య అన్ని హ్యాథ్‌వే ద్వారా కలిగిన కొడుకు హమ్నెట్. అతను 11 ఏళ్ల వయస్సులోనే చనిపోయాడు. షేక్‌స్పియర్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు పెళ్లిలు చేసుకొని స్థిరపడ్డారు.

No comments:

Post a Comment