జనసేనాని పవన్ – బాబు భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది.అన్నదారినే తమ్ముడు అనుసరిస్తున్నాడన్న టాక్ వినవస్తోంది.”మాది ఆర్ధిక స్థోమత లేని పార్టీ అనడం” కొంత విస్మయానికి గురిచేస్తోంది.బాబుతో భేటీ అనంతరం.. కొత్త కార్యాచరణ ప్రకటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతాడని భావించినప్పటికీ పవన్ అవేమీ
చేయకపోవడం గమనార్హం.ఐతే.. ఇదే సమయంలో 2019 ఎన్నికల బరిలో దిగడం ఖాయమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.మరోవైపు జనసేన విలీనంపై కూడా కొన్ని రూమర్లు వస్తున్నాయ్. కొందరైతే టీడీపీలో పార్టీని విలీనం చేస్తారని, మరికొందరైతే బీజేపీ చెంతకు ఆయన చేరుతారని ఇలా పలు విధాల వాదనలు వెల్లువెత్తుతున్నాయ్.
ఒకవేళ ప్రజారాజ్యం మాదిరిగానే పార్టీ పరిస్థితిని తీసుకువస్తే పవన్ విమర్శల పాలవడం ఖాయం.అలాకాక పార్టీని స్వీయశక్తితో నడిపిస్తేనే మేలు.
విలీనం ఉన్నట్టా..లేనట్టా..?
ఒకవేళ ప్రజారాజ్యం మాదిరిగానే పార్టీ పరిస్థితిని తీసుకువస్తే పవన్ విమర్శల పాలవడం ఖాయం.అలాకాక పార్టీని స్వీయశక్తితో నడిపిస్తేనే మేలు.
విలీనం ఉన్నట్టా..లేనట్టా..?
వాస్తవానికి పవన్ చెప్పినట్లు అభిమానం అన్నది నాలుగు ఓట్లు రాల్చేందుకు పనికిరాదు.ప్రజాక్షేత్రంలో ఇవాళ నెట్టుకురావడం అనుకున్నంత వీజీ కాదు.అందుకనో/ ఇంకెందుకనో ఇవాళ నేరు కార్యాచరణకు పవన్ పూనుకోవడం లేదు.అంతేకాదు జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలు ప్రారంభించి, తదుపరి కార్యాచరణను నిర్దేశించాలంటే అది కూడా ఆర్థికాంశాలతో కూడుకున్నదే! ఇంతకూ జనసేన కు క్షేత్రస్థాయి కార్యవర్గం ఎక్క డిదని? ఇంతకూ జనసేనకు జిల్లాలపై పట్టెక్కడిదని? ఏదేమైనా ఒన్ మేన్ ఆర్మీగా పవన్ ఉన్నంతకాలం ఆయన సేవలు మరొకరికి ఉపయోగమే మో గానీ అవేవీ జనసేన ప్రతిష్టను పెంచేవి కావు.కానీ పవన్ వ్యూహం ఏంటన్నది అంతుపట్టడం లేదు.ఆయన ఆంతర్యం ఏంటన్నది పాలుపోవ డం లేదు.ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం పార్టీ విలీనంపై ఆయన మొగ్గు చూపడం లేదు. అదేవిధంగా ఫుల్‌టైం పొలిటీషియన్‌గా రోడ్డెక్కేం దుకూ ఇష్టపడడం లేదు.ఇప్పటికిప్పుడు రాజకీయ రంగంలో దూకే కన్నా..కొన్నైనా ప్రజోపయోగ పనులు చేయాలన్నదే ఆయన తలంపు.
No comments:
Post a Comment