Wednesday, 17 February 2016

రాజ‌మౌళి వెయ్యి కోట్ల సినిమా హీరో ఇత‌డే..!

రాజ‌మౌళి వెయ్యి కోట్ల సినిమా హీరో ఇత‌డే..!

8590456012010

ద‌ర్శ‌కుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ల‌లో ఒకటైన ‘గరుడ’ లో హీరోగా నటించడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్‌లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. తొలి నుంచి ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనే విషయంపై తీవ్రమైన చర్చలు ఇటు ఫిలింనగర్‌తో పాటు అటు సోషల్ మీడియాలో కూడా జ‌రిగాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్‌లలో ఎవరో ఒకరితో రాజ‌మౌళి ఈ సినిమా చేయవచ్చని ప్రచారం కూడా జరిగింది. ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు హీరోగా కె.ఎల్ నారాయణ నిర్మాతగా ఓచిత్రం చేయడానికి కమిట్ అవ్వడంతో.. గరుడ ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు హీరోగా నటించనున్నాడని చాలా మంది అంచనా వేశారు. తాజాగా ‘గరుడ’ గా కనిపించేది మహేష్ బాబు కాదని.. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ అని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.
‘గరుడ’కు సంబంధించి ఇటీవల రాజమౌళికి- ఎన్టీఆర్‌కు మధ్య చర్చలు జరిగాయని.. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు మరో ప్రాజెక్ట్ చేయకుండా పూర్తి సమయం కేటాయించడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నాడని ఫిలింనగర్ సమాచారం. ‘బాహుబలి’ కన్నా ఎక్కువ బడ్జెట్‌ తో.. సుమారు 1,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాజమౌళి అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే, ‘బాహుబలి పార్ట్‌-2′ తర్వాత ‘గరుడ’ చిత్రం వర్క్ ను రాజమౌళి మొదలుపెడతారని స‌మాచారం. మొత్తానికి ఎన్టీఆర్ గనుక రాజమౌళి గరుడ లో అవకాశం దక్కించుకుంటే.. అతడు కెరీర్‌లో అతి పెద్ద జాక్ పాట్ ను కొట్టేసినట్టే !
‘గరుడ’ అంటే గరుత్మంతుడు. శ్రీ మహా విష్ణువు వాహనమైన ‘గరుత్మంతుడు’ జీవితం ఆధారంగానే రాజమౌళి ‘గరుడ‌’ను తెరకెక్కించాలనుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా.. ఓ వైపు ‘బాహుబలి′ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. వీలు కుదిరినప్పుడల్లా ఆయన ‘గరుడ‌’ స్క్రిప్ట్‌ మీద వర్క్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ టెక్నికల్‌ విషయాల మీద మరింత అవగాహన పెంచుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

No comments:

Post a Comment