Thursday, 4 February 2016

హట్ హట్ గా యాంకర్ రష్మీ ట్రైలర్

4501010120

వెండితెరపై సరైన ఛాన్స్ లేక బుల్లితెరపై ఫోకస్ పెట్టింది యాంకర్ రేష్మి. బుల్లితెర‌పై త‌న హాట్ హాట్ అందాల‌తో ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టిన రష్మీ వెండితెర‌పై ఎప్పుడైనా ఛాన్స్ రాకుండా పోతుందా త‌న అదృష్టం ప‌రీక్షించుకోవ‌చ్చ‌న్న ఆశ‌తో ఎదురు చూస్తుండ‌గా ఆమెకు సిల్వ‌ర్ స్ర్కీన్‌పై ఓ ల‌క్కీ ఛాన్స్ వ‌చ్చింది. నేష‌న‌ల్ అవార్డు విజేత అయిన దర్శ‌కుడు ప్ర‌వీణ్ సత్తార్ గుంటూరు టాకీస్ పేరుతో తెర‌కెక్కిస్తున్న మూవీలో యాంకర్ రష్మీ శ్రద్ధాదాస్ లను లీడ్ రోల్స్ లో తీసుకోవడంతో ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. చాలాకాలం క్రితమే పోస్టర్స్ కూడా వేసినా.. ఈ మూవీ సంగతులు చాన్నాళ్లు బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం రిలీజ్ కి రెడీ చేస్తున్నారు యూనిట్.
తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే సినిమాలో హీరో సిద్ధూతో కలిసి అందాలు బాగానే ఆరబోసిన‌ట్టు క‌నిపిస్తోంది. దొంగలరాణి కేరక్టర్ లో శ్రద్ధాదాస్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక రష్మీ గౌతమ్ అంతే.. సెక్సీ ఫీలింగ్స్ ని ఒక ఒలికించేసింది. యాక్టింగ్ లో తన్మయత్వాన్ని బాగా చూపించింది. ఓవ‌రాల్‌గా గుంటూరు టాకీస్ ఆకట్టుకునేలాగే ఉంది. ప్రధానంగా పల్లెటూరి సరసాలు దొంగతనాలకు.. దొంగల ముఠా ఎపిసోడ్ ని మిక్స్ చేయడం బాగానే కుదిరింది. ఇక ర‌ష్మీ చాన్నాళ్లు గ్యాప్ తర్వాత ఒక్కసారిగా జిగేల్ మనిపించింది. థియేటర్స్‌లో ఈమెని ఆడియన్స్ ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారో వెయిట్ అండ్ సీ!

No comments:

Post a Comment