‘బాహుబలి’ అంటే రికార్డులు.. రికార్దులంటే బాహుబలి ఈ వాక్యం తెలుగు ఇండస్ర్టీలో ఒక్క బాహుబలి
సినిమాకు మాత్రమే సొంతమేమో అన్నట్టుగా ఆ సినిమా రికార్డులను సాధించింది. ఒక్క తెలుగు పరిశ్రమలోనే గాక భారత చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన సినిమా బాహుబలి. దాదాపు 600 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా రాజమౌళికి పద్మ శ్రీ బిరుదును సైతం తెచ్చిపెట్టింది.
కలెక్షన్లు, ఏరియా వైజ్ రికార్డులు, టీవీ రేటింగ్స్, ఓవర్సీస్ కలెక్షన్స్, మేకింగ్ బడ్జెట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాకి అన్నీ రికార్డులే. ఆలాంటి సినిమాని ఎన్టీఆర్ ఒక విషయంలో మాత్రం దాటేశాడు. నాన్నకు ప్రేమతో వంటి భారీ హిట్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకుడు. కొరటాల శివకు కూడా ముందు చిత్రం శ్రీమంతుడు భారీ హిట్ కావడంతో వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మలయాళం డబ్బింగ్ రైట్స్ రూ. 4. 5 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
బాహుబలి సినిమా మలయాళం రైట్స్ రూ. 3. 5 కోట్లకు అమ్ముడయ్యాయి. కాబట్టి బాహుబలితో పోల్చుకుంటే ఎన్టీఆర్ జనతా గ్యారేజీనే ఎక్కువ రేటుకు అమ్ముడై బాహుబలిని దాటేసింది. ఇక ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ కూడా రూ 6.5 కోట్లకు అమ్ముడయ్యి పెద్ద రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇప్పటికే రూ.65 కోట్ల బిజినెస్ చేసింది.
No comments:
Post a Comment