Tuesday, 2 February 2016

కాపు గ‌ర్జ‌న‌లో హీరో అత‌డే..!

5906065054024

కాపులంద‌రికీ ఆరాధ్యుడిగా.. ఆ సామాజిక వ‌ర్గానికి ఒక గుర్తింపు తెచ్చిన నేత‌గా.. వారి హ‌క్కుల కోసం పోరాడిన నేత‌గా.. ప్ర‌జ‌ల గుండెల్లో.. ముఖ్యంగా కాపులంద‌రి హృద‌యాల్లో ఎప్ప‌టికీ చిరస్థాయిగా నిలిచిపోయే వ్య‌క్తి.. వంగ‌వీటి మోహ‌న్ రంగా. తునిలో జ‌రిగిన `కాపుగ‌ర్జ‌న‌`లోనూ ఆయ‌నే హీరోగా నిలిచారు. `మోహ‌ర రంగా అమ‌ర్ ర‌హే.. రంగాకు జై` అంటూ ఆ ప్రాంత‌మంతా హోరెత్తిపోయింది. ఉదయం తొమ్మిది గంటల నుంచే సభ ప్రాంగణానికి చేరుకున్న అనేక కాపు బృందాలు.. `మోహనరంగా అమర్‌రహే, రంగాకు జై` అంటూ నినాదాలు చేశారు. ఆయన ఫొటోను స్టేజ్‌ మీదకు తీసుకువెళ్లి `హీరో మోహన్‌రంగా` అంటూ నినదించారు. `రంగా, ముద్రగడలకు జైజై` అంటూ సభకు వచ్చిన వారంతా నినదిస్తూనే ముందుకు సాగారు.
అయితే ఈ స‌భ‌లోనే కాపు నాయ‌కుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప‌వ‌ర్ స్టార్ ప్ర‌స్తావ‌న రాక‌పోవ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గురించి కాపు యువకులెవ‌రూ ప్ర‌స్తావించ‌లేద‌ట‌. గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌ పిలుపు మేరకు ఆ సామాజికవర్గానికి చెందిన యువతతో సహా అంతా టీడీపీ వైపు మొగ్గుచూపారన్న అభిప్రాయం ఉంది. టీడీపీ విజ‌యంలో ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గ ఓట‌ర్ల‌ది కీల‌క పాత్ర‌. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆ వర్గంలో విపరీతమైన ఆదరణ సహజంగానే ఉంటుంది. కానీ అంత పెద్ద మీటింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఎవరూ మాట్లాడలేదట. అంతేకాక నినాదాలు కూడా చేయ‌లేదు. పవన్ కళ్యాణ్ గురించి యువకులు ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమేనని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

No comments:

Post a Comment