అందాల అనుష్క జీరో సైజ్ అంటూ సన్నజాజి తీగలాంటి నడుముతో చక్కిలిగిలిపెడుతుంటే..పాపం! ఎయిర్ ఇండియా ఏమనుకుందో ఏమో!తమ ఉద్యోగినులు లావెక్కారని, విధులకు పనికిరారని ఉన్నట్టుండి 125 మంది ఎయిర్ హోస్టెస్‌లను తీసిపడేసింది. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వారు ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నారని, బరువు తగ్గించుకుని స్లిమ్ గా మారేందుకు నిర్ణీత గడువు ఇచ్చినా.. మారలేదని ఆరోపిస్తూ.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా సంస్థలో పనిచేస్తున్న 600 మంది సిబ్బంది స్థూలకాయులుగా ఉండగా.. ఒళ్లు తగ్గించుకోవాల ని చాలా కాలం క్రితమే సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కానీ కొందరు దీనినిపట్టించుకోలేదు.వాస్తవానికి ఎయిర్ హోస్టెస్ విషయంలో.. ఎయిర్ లైన్స్ సంస్థలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులకు ఆకర్షణీయంగా కనిపించేలా.. చక్కటి అందం, మంచి ఎత్తు, తీరైన శరీరాకృతి, చక్కటి పళ్ల వరస వీరికి సొంతమై ఉండాలి.ఉద్యోగంలో చేరే సమయంలో వీరూఅలానే ఉన్నారు. కానీ.. రాను రాను ముద్దు గుమ్మలు కాస్త బొద్దుగుమ్మలుగా మారిపోయారన్నది ఎయిర్ లైన్స్ యాజమాన్యాలఆరోపణ. మళ్లీ వీరంతా విధుల్లో చేరాలంటే నానా కష్టాలు పడి స్లిమ్ గా మారాల్సిందే..! లేకపోతే భవిష్యత్ గాల్లోనే.. ఏదేమైనప్పటికీ..ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్న ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై..దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Thursday, 4 February 2016
ఎయిర్ ఇండియాలో లావు ఉద్యోగుల తొలగింపు !

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment