Thursday, 4 February 2016

తమన్నా చేతిలో క్రేజీ ప్రాజెక్టు

tam-278282

ఇప్పటి వరకూ ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లామర్ హీరోయిన్స్ కి ఎంతో కొంత వెలితి ఉండేది. వారు టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్నప్పటికీ, వారికి నచ్ఛిన కథల్లో మాత్రం నటించలేకపోతున్నాము అనే ఫీలింగ్ ఉంటుంది. హీరోయిన్స్ అంటేనే పూర్తిగా హీరోల కథలో నటించే వాళ్ళు. హీరోల కథల విషయంలో హీరోయిన్స్ వ్యక్తిగత నిర్ణయాలకి ఎక్కడా ఛాన్స్ దొరకదు. ఒకవేళ సొంతగా లీడ్ హీరోయిన్ గా సినిమా తీస్తే…ఆ సినిమా ఆడుతుంతో?లేదో? అనే భయం వీరికి అణువణువునా ఉంటంది. అందుకే హీరోయిన్స్ ఇటువంటి ప్రయత్నాలు చేయరు. అయితే చాలా కాలం తరువాత స్టార్ హీరోయిన్ ని సంతోష పెట్టగలిగే ఓ కథ తన ముందుకు వచ్చింది. ఇంకేం ఆలోచించకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే ప్రభుదేవా నిర్మాణంలో రాబోతున్న సినిమా. ప్రభుదేవ నిర్మాతగా మారి స్టూడియోస్ అనే బ్యానర్‌లో వరుస సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ బ్యానర్‌లో ఆయన తమన్నా హీరోయిన్ గా ఓ క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఎల్. విజయ్ దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సోనూసూద్ విలన్‌గా నటించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. హర్రర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ కథ తనకు బాగా నచ్ఛటంతో వెంటనే ఓకే చెప్పానని, ఇంతటి మంచి టేస్ట్ ని కలిగి ఉన్న ప్రభుదేవాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటున్నారు. తను చాలా కాలం తరువాత కథ విషయంలో సంతోషపడ్డ మూవీ ఇదే అని ప్రభుదావాకి చెప్పుకొచ్చిందట.

No comments:

Post a Comment