Thursday, 4 February 2016

ఈ డైరెక్టర్ కూడ పవన్ చెంతకే చేరాడు

santhosh-srinivas-272

పవర్ స్టార్ వవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో కేవలం యంగ్ డైరెక్టర్స్ తోనే పని చేస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్స్ కంటే యంగ్ డైరెక్టర్స్ తోనే తను కంఫర్ట్ గా ఉంటానని గతంలో పవన్ చెప్పుకొచ్చాడు. అందుకే యంగ్ డైరెక్టర్స్ తో వరుస సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ‘కందిరీగ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సినిమాటోగ్రాఫర్ సంతోష్ శ్రీనివాస్, ఇప్పడు పవన్ మూవీకి పనిచేసే అవకాశం కనిపిస్తుంది. తన మొదటి సినిమా కందిరీగతోనే సూపర్ హిట్ కొట్టిన సంతోష్ శ్రీనివాస్ ఆ తర్వాత ‘రభస’ సినిమాతో ఏకంగా మరో హిట్ ని కైవసం చేసుకన్నాడు. తాజాగా సంతోష్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కి ఓ కథని చెప్పాడంట. అయితే తను చెప్పిన కథ విధానం, పవన్ కి ఎంతగానో ఇంప్రెస్ చేసింది. దీంతో సంతోష్ శ్రీనివాస్ తో డైరెక్ట్ మూవీ కాకుండా, రిమేక్ ఫిల్మ్ చేద్ధాం అని ఫిక్స్ అయ్యాడంట. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వేదాళమ్’ సినిమాను పవన్ కళ్యాణ్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ మూవీ రిమేక్ బాధ్యతని సంతోష్ శ్రీనివాస్ కి ఇవ్వనున్నాడు. అయితే మరోవైపు వేదాళమ్ మూవీ తెలుగు రిమేక్ కి పవన్ అంత ఆసక్తిగా లేడనే ప్రచారం కూడ జరుగుతుంది. మరి సంతోష్ శ్రీనివాస్ ని వేదాళమ్ రిమేక్ కి ఉపయోగించుకుంటాడా? లేదా మరో మూవీకి ఉపయోగించుకుంటాడా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడల్సిందే అని అంటున్నారు.

No comments:

Post a Comment