మెగా హీరోలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉన్న హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్
మూవీలలో స్టోరీ తన అభిమానులను ఎంత బాగా అలరిస్తుందో…ఆ విధంగానే తన మూవీ సాంగ్స్ సైతం అభిమానులకి పిచ్ఛెక్కిస్తుంది. గతంలో ‘దేఖో దేఖో గబ్బర్ సింగ్’ అంటూ ‘గబ్బర్ సింగ్’లోని ఇంట్రడక్షన్ సాంగ్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన యాటిట్యూడ్ కి తగ్గ సాంగ్ ని సర్ధార్ గబ్బర్ సింగ్ లో పెట్టకుంటున్నాడు.
ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ లోని ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేయనున్నారు. దీనికోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేన శ్రద్ధని తీసుకుంటున్నాడు. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ లోని 70 శాతం కంపోజిషన్ పవన్ కళ్యాణ్ దే ఉంటుందట. కేవలం అభిమానుల కోసం తన మేజరిజంలోని ప్రత్యేకతని ఇందులో పవన్ చూపించనున్నాడు. అందుకే ఖుషీ మూవీ నుండి తను చూపిస్తున్న మేనరిజాన్ని ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ చూపించాలని భావిస్తున్నాడంట. ఈ విషయంలో కొరియోగ్రాఫర్ కి పవన్ కళ్యాణ్ చెప్పిందే జరగాలి అనే సంకేతాలు వచ్చాయని అంటున్నారు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే, పవన్ గబ్బర్ సింగ్ లోని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లోనూ అదే రోల్ ని చేస్తున్నారు. .ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ స్పెషల్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ఈ నెల 25 వరకూ జరగనుంది.
No comments:
Post a Comment