తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సంగీత దర్శకుల్లో చాలా మంది కాపీ క్యాట్‌లుగా
మారిపోతున్నారు. ఏదో ఆడియోకు పాత ట్యూన్లను కాస్త అటూగా ఇటూగా మార్చి ఇచ్చేస్తున్నారు. ఆడియోకే 50 శాతం పాత ట్యూన్లను కాపీ కొట్టేస్తున్న సదరు సంగీత దర్శకులు ఆర్ ఆర్ విషయంలో అయితే మరీ దారుణంగా కాపీ కొట్టేస్తున్నారు. ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న వారి జాబితాలో థమన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటున్నాడు.
థమన్ తన పాత పాటల ట్యూన్లనే దించేయడమో లేదా తాను ఇతర భాషల్లో ఇచ్చిన ట్యూన్లను దించేయడమో చేసేస్తున్నాడు. మన హీరోలు, దర్శకులు కూడా ఫాస్ట్‌గా ట్యూన్లు ఇచ్చేస్తున్నాడని అందరూ థమన్‌తోనే మ్యూజిక్ కొట్టించుకోవడంతో మనోడి కాపీకి అడ్డూ అదుపులేకుండా పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం పైన ఇంతకుముందు థమన్‌ను మీరు కాపీ క్యాట్ అన్న విమర్శలు వస్తున్నాయి అని అడిగితే చాలా ఓపెన్‌గానే ఆన్సర్ చెప్పాడు. మిగతావాళ్ళు కాపీ కొడితే ఎవరికీ తెలియదు.. నేను మాత్రం దొరికిపోతాను అని చెప్పుకొచ్చాడు. పైగా డైరెక్టర్, హీరో… ఇలా వాళ్ళందరికీ తెలియకుండా నేను ఆ పని ఎందుకు చేస్తాను అంటూ కొంత బాధ్యత వాళ్ళమీద కూడా పెట్టాడు.
ఇక ఈ స్టోరీ అంతా ఇప్పుడు ఎందుకంటే థమన్ సంగీతం అందించిన బన్నీ సరైనోడు సినిమా టీజర్ ఈ రోజు సాయంత్రం రిలీజ్ అయ్యింది. టీజర్ బానే ఉందన్న టాక్ వచ్చింది. అయితే సోషల్ మీడియా వాళ్లకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కడో విన్నట్టు ఉందే అన్న అనుమానం వచ్చింది. థమన్ ఎక్కువ శ్రమ పడకుండా వెంటనే హాలీవుడ్ మూవీ ట్రాన్స్ ఫార్మర్స్ -3 మూవీ ట్రైలర్ నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాపీ కొట్టాడని కనిపెట్టేశారు. మీరు కనుక ట్రాన్స్ ఫార్మర్స్ -3 సినిమా ట్రైలర్ ని యుట్యూబ్ లో చూశారంటే వెంటనే మీకు విషయం అర్థం అవుతుంది. దీంతో థమన్ మరోసారి కాపీ క్యాట్ అని తనకున్న పేరును సార్థకం చేసుకున్నాడు.
No comments:
Post a Comment