ఇద్దరూ నటీనటులే! బుల్లి తెర ప్రేక్షకులను తమ నటనతో మెప్పించిన వారే! అయితే ఇద్దరి
మధ్య ఏదో చిన్న విషయంలో తగాదా ఏర్పడింది. అది చినికి చినికి గాలివానగా మారింది! అయితే ఇందులో ఆగ్రహానికి గురైన నటి.. తోటి నటుడిని మాటలతో మానసికంగా హింసించింది. పరుష పదజాలంతో దూషించింది! అతడిని చిత్రవేదనకు గురిచేసింది! ఆమె మాటలు తట్టుకోలేని ఆ నటుడు.. వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఆమె జైలు ఊసలు లెక్కపెడుతోంది.
సహ నటుడ్ని సూసైడ్‌కు ప్రేరేపించిందన్న ఆరోపణలపై ఒరియా నటి ప్రలిప్త ప్రియదర్శిని అలియాస్ జెస్సీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాలాసోర్ కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈనెల 6న ఒక సంగీతం ఈవెంట్ ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో జరిగింది. దీనికి బుల్లితెర నటి ప్రియదర్శిని, మరో నటుడు రంజిత్ పట్నాయిక్ అలియాస్ రాజాలు వెళ్లారు.
ఈవెంట్ కూడా చక్కగా జరగడంతో షో ముగిసిన తరువాత రాజాకు రూ. 2వేలు, జెస్సీకి రూ. 27,000 చెల్లించారు. అనంతరం ఇద్దరు కారులో వెళ్తుండగా వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. దీంతో ఆగ్రహానికి గురైన జెస్సీ, ఇలాగైతే వృత్తిలో రాణించలేవని అంటూ రాజాపై బూతుల పంచాంగం విప్పిందని సమాచారం. దీన్ని అవమానంగా భావించిన రాజా.. డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి బ్రిడ్జిపై నుంచి కిందికి దూకేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వ్యవహారంపై రాజా బంధువులు జెస్సిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టుచేశారు. ఆమె నుంచి నిజాలు రాబట్టేందుకు అవసరమైతే పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు పోలీసులు.
No comments:
Post a Comment