Thursday, 4 February 2016

ప్ర‌భాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్

dsdsdsd

ప్రభాస్ పెళ్లి విషయ‌మై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. వాస్తవానికి ఆన్‌స్క్రీన్ వండ‌ర్ బాహుబ‌లి విడుద‌ల త‌రువాత ప్రభాస్‌తో మూడు ముళ్లు వేయించాలకున్నారు పెద‌నాన్న కృష్ణంరాజు. కానీ కొన‌సాగింపు భాగం పూర్త‌వ్వ‌నిదే పెళ్లి చేసుకోన‌ని తెగేసి చెప్పాడు యంగ్ రెబ‌ల్ స్టార్‌. “బాహుబ‌లి – 2 ” పై.. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉన్నందున.. ఈ సమయంలో పెళ్లి జరిగితే .. ఇది తనకు.. త‌నను చేసుకోబోయే అమ్మాయికి కూడా ఇబ్బందేనని చెప్పి పెళ్లి వాయిదా వేశాడు ప్రభాస్‌.దీంతో మాట కాదనలేకపోయారు కుటుంబసభ్యులు.తాజా స‌మాచారం ప్ర‌కారం.. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ప్రభాస్ పెళ్లి చేసేయ్యాలని కృష్ణంరాజు నిర్ణయించినట్టు తెలుస్తోంది. “బాహుబ‌లి – 2 ” విడుద‌ల‌తో సంబంధం లేకుండా.. షూటింగ్ ముగిసిన వెంటనే ప్రభాస్‌ను ఓ ఇంటివాడిని చేసేయ్యాలని నిర్ణ‌యించార‌ట కృష్ణంరాజు. భీమవరాని చెందిన 22 ఏళ్ల అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోనున్న సంగతి విధిత‌మే! కాగా..”బాహుబ‌లి – 2 ” షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ లో మొద లై.. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి కానుందని తెలుస్తోంది.మొత్తానికి అభిమానులకూ..ఆత్మీయుల‌కూ ప్ర‌భాస్ ప‌ప్ప‌న్నం పెట్ట‌నున్నాడ‌న్న మాట‌! ఎనీవేస్‌..కంగ్రాట్స్ ప్ర‌భాస్.

No comments:

Post a Comment