పవర్ ఫుల్ డై లాగులకు.. పంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే టాలీవుడ్
సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిన చిత్రం బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాహుబలి ఫస్ట్ పార్ట్‌లో విలన్ భల్లాలదేవుడు అడవి దున్నతో పోరాడే దృశ్యం ఉంటుంది. కాకుంటే.. సదరు ఫైటింగ్ మొత్తం గ్రాఫిక్స్ కావటం తెలిసిందే. మొదటి భాగంగా అడవిదున్నతో పోరాట దృశ్యాలతో ఆకట్టుకున్న జక్కన్న.. ఈసారి తన బాహుబలి 2లో.. రియల్ పులితో సిత్రాలు చేయించనున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపధ్యంలో బాహుబలి ఫైట్ మాస్టర్ పీటర్ హోయిన్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పులితో ఉన్న ఫోటోను విడుదల చేశారు. ఈ ఫొటో చూసిన వారు ఇది బాహుబలి – 2 కు సంబందించి ఓ పైట్ సీన్‌లోది అయ్యి ఉండవచ్చని అంటున్నారు. బాహుబలి ప్రభాస్ పులితో ఫైట్ చేసే ఒకటి ఉంటుందని ఆ సీన్‌లో భాగంగా పులికి ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ శిక్షణ ఇస్తున్నారని టాక్ వస్తోంది.
రియల్ గా పులి కాని ఎదురైతే.. క్షణం ఆలోచించకుండా పరుగులు తీస్తాం.. తప్పించుకుపోవాలని ప్రయత్నిస్తాం. అలాంటిదేమీ లేకుండా ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ మాత్రం అందుకు భిన్నంగా పులితో ఆటలాడుకోవటం ఆసక్తికరమే. కుక్క పిల్లతో ఆడుకుంటున్నట్లుగా పులితో అతగాడి చేష్టలు చూస్తే గుండె చిక్కబడాల్సిందే. బాహుబలి 2లో ప్రభాస్ ఈ రియల్ పులితో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ షాకింగ్ ఇస్తాడా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి జవాబు దొరకాలంటే.. కొద్దినెలల పాటు వెయిట్ చేయాల్సిందే.
No comments:
Post a Comment