Sunday, 14 February 2016

ఆ పిచ్చి కాంగ్రెస్ వాళ్లకి నా సమాధానం – వర్మ

8485008045012

వంగవీటి మోహన రంగా జీవిత చరిత్రపై సినిమా తీస్తానని చెప్పిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను విశాఖపట్నం మెంటల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని ధ్వ‌జ‌మెత్తిన కాంగ్రెస్ నేత‌ల‌కు వ‌ర్మ అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చాడు. నా మెదడుకి చికిత్స చెయ్యాలని చెప్తున్న ఆ కాంగ్రెస్ వాళ్లను వ‌ర్మ ఓ రేంజ్‌లో ఫుట్‌బాల్ ఆడుకున్నాడు. నాకు కనీసం చికిత్స చెయ్యడానికి మెదడన్నా ఉంది. వాళ్లకి ఆ మెదడు కూడా లేకపోవడం మూలానే అలాంటి కూతలు కూస్తూ, అటువంటి చేష్టలు చేస్తున్నారు. మెదడు లేకుండా కూడా మనుషులు బతికేయొచ్చని నిరూపించిన ఆ అద్భుతమైన కాంగ్రెస్ వాళ్లని అడ్వాన్స్డ్ మెడికల్ రీసర్చ్ కోసం అమెరికా పంపించవలసిందిగా నరేంద్రమోడీ గారికి నేను వినతిపత్రం అందించబోతున్నా అని ఘాటైన రిప్లే ఇచ్చాడు.
వంగవీటి సినిమాలో రాజీవ్‌గాంధీ క్యారెక్ట‌ర్ ఉంద‌న్న విష‌యం వ‌ర్మ ప్ర‌క‌టించ‌డంతో కాంగ్రెస్ నేత‌లు వ‌ర్మ‌పై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. రాంగోపాల్ వర్మ మానసిక స్థితి సరిగా లేదని, ఆయనను వెంటనే కోరుతూ.. మెంటల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు పలువురు కాంగ్రెస్ నాయకులు విన‌తిప‌త్రం అందించారు. దీనికి వ‌ర్మ కూడా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు.

No comments:

Post a Comment