విరాట్ కోహ్లి, అనుష్క శర్మల ప్రేమకథే కాదు.. బ్రేక్ అప్ స్టోరీ కూడా సంచలనం కలిగిస్తోంది. కోహ్లీ పెళ్లి
ప్రతిపాదన అనుష్క తిరస్కరించడంతోనే వీరిద్దరి లవ్ బ్రేకప్ అయ్యిందని ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో మరో మ్యాటర్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో కథానాయికగా అనుష్కను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్ తో తొలిసారి జతకట్టనున్న అనుష్కకు ఇది భారీ ప్రాజెక్ట్. అయితే విరాట్ కోహ్లీ ఈ సినిమాలో అనుష్కను నటించవద్దని చెప్పాడట.
కోహ్లీ జోక్ చేస్తున్నాడనుకున్న అనుష్క సుల్తాన్ సినిమాకు కమిట్ అయ్యింది. దీంతో ఈసారి కోహ్లీ సీరియస్ గా ‘సినిమాల సంగతి పక్కనపెట్టి ముందు ఇంటిని ఎలా నడపాలో నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించు’ అంటూ త్వరలో కాబోతున్న వారి వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాడని వినికిడి. కోహ్లి మాటలకు గట్టిగానే సమాధానం ఇచ్చింది అనుష్క. తర్వాత ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి అది కాస్తా విడిపోవడానికి దారి తీసింది. తాను నటిస్తున్న ఓ సినిమాతో కలిపి ఇప్పటికే అనుష్క మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది. వీటితోపాటు చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. కెరీర్ ఇంత పీక్ స్టేజ్ లో ఉండగా పెళ్లి చేసుకునేందుకు, అలాగే కోహ్లీ చెప్పినట్లు సినిమాలు వదులుకునేందుకు అనుష్క ప్రస్తుతం సిద్దంగా లేకపోవడంతో ఇక ‘బ్రేక్ అప్’ ఒక్కటే వీరికి కనిపించిన దారిగా తెలుస్తోంది. ఫైనల్‌గా సల్మాన్ సినిమా వల్ల అనుష్క, కోహ్లీ లవ్ బ్రేకప్ అయ్యిందన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment