Sunday, 14 February 2016

అన‌సూయ‌కు కోపం వ‌చ్చింది

1078405520120

బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించి వెండితెరంగ్రేటం చేసిన హాట్ యాంక‌ర్ అన‌సూయకు మ‌ళ్లీ కోప‌మొచ్చింది. అన‌సూయ డ్రెస్ వేసుకునే తీరుపై సోష‌ల్ మీడియాలో చాలా ఘాటుగా కొంద‌రు ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అమ్మ అయ్యాక కూడా ఆమె ఇష్ట‌మొచ్చిన‌ట్టు డ్రెస్‌లు వేసుకుంటూ ఆడాళ్ల ప‌రువు తీసేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు ఆమెపై సోష‌ల్ మీడియాలో కావాల్సిన‌న్ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అన‌సూయ ఆడాళ్ల ప‌రువు తీస్తుందంటూ ఏకంగా కొంద‌రు ఆమెపై నెగిటివ్ ప్రచారం సాగించారు. అయితే త‌న‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం ఆగ‌క‌పోవ‌డంతో అన‌సూయ‌లో ఆగ్ర‌హం కట్ట‌లు తెంచుకుంది.
ఈ సంద‌ర్భంగా త‌న హేట‌ర్స్‌కు అన‌సూయ ఓ ఘాటైన పోస్ట్‌తో కౌంట‌ర్ ఇచ్చింది. మీరంతా మీ జీవితాల్లో బాగా విసుగెత్తి పోయుంటారు. కాస్త అవ‌త‌లి వాళ్ల జీవితాల గురించి ఆలోచించే కంటే మీ కోసం ఆ టైమ్ ఉప‌యోగించుకుంటే స‌క్సెస్ అయ్యేవాళ్లు మీరు. నేనేం చేసినా అది నా జీవితం కెరీర్ కోస‌మే. నా వృత్తిప‌ర‌మైన జీవితంలో ఇదంతా కామ‌న్‌… రోమ్ లో ఉన్న‌పుడు రోమ‌న్ లానే ఉండాలి. ఇప్పుడు నేను చేస్తున్న‌ది కూడా అదే. దాన్ని మీరు విమ‌ర్శించ‌డం మీ విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా. నా ప్రొఫెష‌న్ ను గౌర‌వించి.. నేను చేస్తున్న ప‌నుల‌కు అండ‌గా ఉండే భ‌ర్త దొరికినందుకు నేను గ‌ర్వంగా ఫీల‌వుతున్నానంటూ ఆమె త‌న హేట‌ర్స్‌కు స‌మాధానం ఇచ్చింది.
ఈ ఘాటైన ప‌దాలు చూస్తే త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ఆమె ఎలా ఫీల్ అయ్యిందో అర్థ‌మ‌వుతోంది. అస‌లు ఈ గొడ‌వ‌కు కార‌ణం ఏంటంటే అన‌సూయ ఈ మ‌ధ్యే ఐఫా ఫంక్ష‌న్ లో బ్యాక్ లెస్ అందాల‌తో ర‌చ్చ చేసింది..అక్క‌డ నుంచి ఆమెపై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఇక అన‌సూయ న‌టించిన క్ష‌ణం సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.

2 comments: