సొట్టబొగ్గుల సుందరీ తాఫ్సీకి ఘోర అవమానం జరిగింది. తాప్సీ ఇటీవల చెన్నైలోని ఓ షాపింగ్ మాల్
ప్రారంభోత్సవానికి హాజరైంది. మూడు గంటలకు అక్కడ సందడి చేయడానికి నిర్వాహకుల నుంచి దాదాపు 5 లక్షల వరకు రాబట్టిందట. అయితే తాప్సీ అక్కడ షాప్ ఓపెనింగ్ చేసే టైంలో ఆమెను కొంతమంది ఆతకాయి ఫ్యాన్స్ చుట్టిముట్టేశారు.అందులో ఒకడు ఆమె చీరను గట్టిగా లాగాడు, దాంతో షాకవ్వడం ఈ అమ్మడి వంతైంది.
ఆ ఆకతాయి తాప్సీ చీర కొంగు పట్టుకుని గట్టిగా లాగడంతో చీరకట్టు కాస్త చిందరవందర అయ్యిందట. ఆమె అభిమానుల మధ్య చిక్కుకుపోవడంతో ఏం చేయలేకపోయిందట. ఎట్టకేలకు బౌన్సర్లు వచ్చి తాప్సీని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారట. దీంతో బయటకొచ్చిన ఈ అమ్మడు, నిర్వాహకులతో గొడవ పడి మరీ వెంటనే కారెక్కేసిందట. చివరకు షాపింగ్ మాల్ యాజమాన్యం హీరోయిన్‌కి సారీ చెప్పి కూల్ చేసిందట. తాప్సీ ఇటీవలే జరిగిన సీసీఎల్ బ్రాండ్ అంబాసిడర్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె రానాతో నటిస్తున్న ఘాజీ మూవీ త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది.
No comments:
Post a Comment