యువరత్న నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు 99 చిత్రాలు చేశాడు. ఈ సంక్రాంతికి డిక్టేటర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఇప్పుడు తన కేరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన వందో సినిమాపై దృష్టి పెట్టారు. ఇక బాలయ్య సినిమాలు ఎక్కువగా బీ, సీ సెంటర్లలోనే ఆడతాయి. బాలకృష్ణకు మొదటి నుంచి ఒక సెంటిమెంట్ ఉంది. బాలయ్య అంటేనే సెంటిమెంట్ల కింగ్..అలాంటి బాలయ్య బీ అనే అక్షరాన్ని ఎక్కువగా నమ్ముతాడన్న టాక్ ఉంది. అందుకే ఎక్కువగా బీ అనే పేరుతో మొదలయ్యే దర్శకులతో ఎక్కువ సినిమాలు చేశారు. హిట్ కూడా అందుకున్నారు. ఆ పేరున్న దర్శకులే బాలయ్యకు కేరీర్‌లో తిరుగులేని హిట్లు ఇచ్చారు.
గతంలో బాలకృష్ణ బి.గోపాల్‌తో చాలా చిత్రాలు చేశారు. అందులో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు బాలయ్య కేరీర్‌లోనే మర్చిపోలేని సినిమాలు. ఇక బాలకృష్ణ బాపుతో కూడా సినిమా చేశారు. అదే శ్రీరామరాజ్యం. ఈ సినిమా బాలయ్య కేరీర్‌లో మరపురాని పౌరాణిక చిత్రంగా నిలిచింది. తరువాత బాలకృష్ణ బోయపాటితో రెండు చిత్రాలు చేశారు. సింహా, లెజెండ్. ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి బాలకృష్ణ 99 చిత్రాలు పూర్తిచేశారు. వందో సినిమా గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు బోయపాటి శ్రీను, సింగీతం శ్రీనివాసరావు, కృష్ణవంశీ, పరుచూరి రవీంద్ర తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే బాలయ్య మరోసారి తనకు బాగా అచ్చొచ్చిన బీ అక్షరాన్ని ఫాలో అయితే మరోసారి తన వందో సినిమా ఛాన్స్‌ను బోయపాటి శ్రీనుకే ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. చూద్దాం బాలయ్య మనస్సులో ఏముందో.
No comments:
Post a Comment