విక్టరీ వెంకటేష్-సౌందర్య-వినీత కాంబినేషన్లో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో వచ్చిన ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు సినిమా రెండు దశాబ్దాల క్రితం సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు టైటిల్ మారింది. ఇంట్లో ఇల్లాలు… అటక మీద ప్రియురాలు. ఇదేదో కొత్త సినిమా టైటిల్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన సంఘటన సారాంశమిది. వెంకటాచలం మండలం నిడుగుంటపాలెంకు చెందిన వెంకటేశ్ స్వప్నను 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కొద్ది రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగినా తర్వాత వీరి కాపురంలో కలతలు రేగాయి. దీంతో 4 ఏళ్ల క్రితం వెంకటేష్ స్వప్నను విడాకులు కోరాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి స్వప్న విడిగా ఉంటోంది. అయితే వెంకటేష్ స్వప్నకు తెలియకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వెంకటేష్‌తో సహజీవనం చేస్తున్న మహిళ స్వప్నకు బంధువు కావడం ఇక్కడ కొసమెరుపు. వీరి వ్యవహారం తెలిసుకున్న స్వప్న వాళ్లింటికి వెళ్లి తన భర్త వెంకటేష్‌ను చెప్పుతో ఎడాపెడా వాయించింది.
స్వప్న రాకను గమనించిన ఆ మహిళ వెంటనే అటకెక్కేసింది. అయితే ఆమె అటకమీద ఉన్న సంగతి గమనించిన స్వప్న పట్టరాని కోపంతో ఆమెను అటకపై ఉండగానే తాడు తీసుకుని కొట్టింది. అయితే ఈ వ్యవహారంలో సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వెంకటేష్‌కు పిన్ని కావడమే. పోలీసులు స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
FOR VIDEO
https://youtu.be/tAtHqsIgh0o
No comments:
Post a Comment