Monday, 22 February 2016

కొరటాలకి జూనియర్ కాస్ట్ లీ గిప్ట్

08015012010

ప్రస్తుతం నాన్నకు ప్రేమతో మూవీ తరువాత జూనియర్ లో కాన్ఫిడెంట్ లెవన్స్ బాగా పెరిగాయి. తనకు ఎన్నడూ సాధ్యం కాని 50 కోట్ల క్లబ్ అనేది, నాన్నకు ప్రేమతో మూవీతో సాధ్యపడింది.ఈ రోజుల్లో తెలుగులో 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని సాధించటం అనేది సామాన్య విషయం కాదు.
అటువంటిది జూనియర్ తను నటించిన నాన్నకు ప్రేమతో మూవీతో కేవలం రెండు వారాల్లోనే 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని అవలీలగా రీచ్ అయ్యాడు. ఇప్పుడు ఈ మూవీ తరువాత కొరటాల శివ కాంబినేషన్ లో ఓ మూవీకి చేస్తున్నాడు. దీనికి జనతా గారేజ్ అని పేరు పెట్టాడు.
ఇప్పటి వరకూ కొరటాల శివ తీసిన రెండు మూవీలు సాధారణ మూవీలు కాదు. ఒకటి 50 కోట్ల రూపాయలను కలెక్షన్స్ ని చూస్తే…మరొకటి 100 కోట్లకి మించిన కలెక్షన్స్ ని చూసింది. హీరో ఏ విధంగా చూపించాలో ఒక్క కొరటాల శివకి మాత్రమే తెలుసు అన్న విధంగా తన మూవీ మేకింగ్ ని చూస్తే తెలుస్తుంది.
అందుకే కొరటాల శివపై జూనియర్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఈ మూవీ కచ్ఛితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో కొరటాలకి జూనియర్ ముందుగా ఓ భారీ గిప్ట్ ని ఇచ్చాడని అంటున్నారు. జూనియర్ కి వాచ్ లు అంటే మహా ఇష్టం. 20 లక్షల ఖరీదైన ఓ వాచ్ ని కొరటాలకి గిప్ట్ గా జూనియర్ ఇచ్చాడనే న్యూస్ ఇప్పుడు వినిపిస్తుంది.

No comments:

Post a Comment