Monday, 22 February 2016

రాజమౌళి 50 కోట్లు ముందే తీసుకుంటున్నాడా?

090546048901230

ప్రస్తుతం రాజమౌళి బాహుబలి మూవీకి సంబంధించిన రెండో పార్ట్ ని పూర్తి చేసే పనిలో బిజిగా ఉన్నాడు. ఈ మూవీ తరువాత రాజమౌళి కచ్ఛితంగా హిందీలో ఓ మూవీని చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని అంటున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ లో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు.
ధర్మ ప్రొడక్షన్ అధినేత అయిన కరణ్ జోహార్…ఇప్పటికే రాజమౌళిని బాలీవుడ్ కి పరిచయం చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. బాహుబలి2 మూవీ షూటింగ్ పూర్తయి..మూవీ రిలీజ్ అయిన అనంతరం ఈ మూవీ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. అయితే బాహుబలి2 మూవీకి సంబంధించిన హిందీ రైట్స్ ని కరణ్ జోహార్ ముందుగా చేజిక్కించుకున్నాడనే వార్తులు వచ్చాయి.
గతంలోనూ బాహుబలి మూవీని హిందీలో రిలీజ్ చేయటమే కాకుండా, బాలీవుడ్ లో బాహుబలిపై హైప్ క్రియేట్ చేసిన వారిలో కరణ్ జోహార్ పాత్ర ఎంతో కీలకమైనది. అందుకే బాహుబలి2 మూవీకి బాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసేందుకు ఆ మూవీ రిలీజ్ కి ఒక నెల రోజుల ముందు…రాజమౌళి హిందీ ప్రాజెక్ట్ వివరాలకి సంబంధించిన అనౌన్స్ మెంట్ బయటకు చేస్తే…బాహుబలి2కి విపరీతమైన పబ్లిసిటి ఏర్పడుతుంది.
అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయంలో కరణ్ జోహార్ ఇప్పటికే రాజమౌళికి దాదాపు 50 కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా ఇచ్చాడని అంటున్నారు. రాజమౌళి సైతం ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారని అంటున్నారు.

No comments:

Post a Comment