హీరోయిన్స్ కి స్టార్ డం పెరుగుతున్నకొద్దీ హీరోల నుండి ప్రపోజల్స్ పెరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో
హీరోయిన్స్ జాగ్రత్తగా ఉండకపోతే కెరీర్ కే నష్టం వాటిల్లవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కి ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఆ తరువాత కొంత కాలం సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ.. తరువాత క్రేజీ హీరోలతో నటిస్తూ…తాజాగా సోగ్గాడే చిన్నినాయన మూవీతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక గ్లామర్ పరంగా తను నటించటానికి రెడీ ఉన్నానని చెప్పుకొస్తుంది. అయితే కొద్దికాలంగా టాలీవుడ్ కి చెందిన యంగ్ హీరో..లావణ్య త్రిపాఠితో డేటింగ్ ప్రపోజల్ అంటూ తెగ తిరుగుతున్నాడంట. అయితే ఆ హీరోని లావణ్య మందలించిన్నప్పటికీ ఇంకా వెంటబడుతూనే ఉన్నాడంట. ఇప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ ఇటువంటి సమయంలో ఇలాంటి ఎపైర్స్ పెట్టుకుంటే నష్టం జరగటం ఖాయం అని అనుకుందట. అందుకే ఈ మధ్య కాలంలో ఆ హీరోకి గట్టి వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు. దీంతో ఆ యంగ్ హీరో ప్రస్తుతం లావణ్య వెంట పడటం లేదని తెలుస్తుంది.
No comments:
Post a Comment