తునిలో కాపు గర్జన సభలో జరిగిన విధ్వంసకర సంఘటనలపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పందించారు. సోమవారం సాయంత్రం ఆయన ఈ సంఘటనపై జనసేన ఆఫీస్‌లో విలేకర్లతో మాట్లాడారు. తునిలో జరిగిన ఘటనపై పవన్ తన విచారాన్ని వ్యక్తం చేశారు. జరిగిన ఘటన చిన్నది కాదని, ఈ ఘటన వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. కాపులను బీసీలలో చేర్చాలనే మాట ఇప్పటిది కాదని బ్రిటిష్ కాలం నుంచి చెప్తూనే ఉన్నారని.. కాని, ఇంతవరకు అది జరగలేదని పవన్ పేర్కొన్నారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
దీని వెనక ఖచ్చితంగా అసాంఘీక శక్తుల హ్యాండ్ తప్పనిసరిగా ఉందని..కేవలం అగ్గి పుల్ల వేస్తే రైలు తగలబడిపోదని..దీని వెనక పెద్ద ప్లానే ఉందని పవన్ చెప్పారు. ఇక ఇదిలా ఉంటే, తెలంగాణలోను, ఉత్తరాంధ్రలోను కాపులు బీసీలుగా ఉన్నారని, కోస్తాలోను, రాయలసీమలో కాపులు ఓసీలలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం, పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదని అన్నారు. ఇకపోతే, సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు కలిసి కృషి చేయాలని, అప్పుడే పరిస్థితులు చక్కబడతాయని అన్నారు. ఇక, ఈ రిజర్వేషన్ల సమస్య ఒక్కరోజులే తీరిపోయే సమస్య కాదని, శాంతియుతంగా పోరాటం చేస్తేనే ఉద్యమం ముందుకు వెళ్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.అసలు లక్షల మంది ఒక సమస్యపై ఉద్యమించేందుకు కదులుతుంటే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదని చెప్పారు.
No comments:
Post a Comment