దర్శక రత్న దాసరి నారాయణరావు చనిపోయాడంటూ పలు సామాజిక వెబ్ సైట్ లలో వారం రోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో స్పందించిన దాసరి తాను బాగానే ఉన్నానని, ఎవరో తనపై ద్వేషం పెంచుకున్న వ్యక్తులు తనపై ఈ ద్రుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను మృతి చెందినట్లు ఫేస్‌బుక్(ఎఫ్‌బీ)లో కామెంట్లు వస్తున్నాయని అలాంటి కామెంట్లు, పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత వారం రోజుల నుంచి ఫేస్‌బుక్‌లు, ఇతర సామాజిక మాధ్యమాల్లో తాను మృతి చెందినట్లు ఫొటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారని వీటిని ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు జనరల్ డైరీ ఎంట్రీ నమోదు చేసి విచారణ చేపట్టారు.
Sunday, 31 January 2016
దాసరి నారాయణరావు చనిపోయాడా ?

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment