కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాకం మరోసారి బయటపడింది.. కాసులకి తప్ప మనుషుల
ప్రాణాలకు విలువ ఇవ్వబోమని రుజువు చేశాయి.. మానవత్వాన్ని మరిచి ప్రవర్తించాయి.. ప్రాణాలు నిలిపే మహోన్నతమైన వృత్తిలో ఉండి.. ఆ పేరుకే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు డాక్టర్లు.. వీరి నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు ప్రాణాలు కోల్పోయాడు.. అంతేకాదు ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులకు చెప్పలేదు.. కానీ.. ఆ బాలుడి మృతదేహానికి వైద్యం చేసి లక్షలు దండుకున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు.. ఇదంతా ఏదో సినిమాలో చూసినట్లు గుర్తొస్తోంది కదూ! అవును అచ్చం ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.. ఏడేళ్ళ హారికకు జ్వరం వచ్చిందని వస్తే… ఆస్పత్రిలో ఏం జరిగిందో తెలుసుకుంటే అందరి కళ్ళు చమ్మగిల్లాల్సిందే.. గుండెలు బరువెక్కాల్సిందే..
ప్రాణం మీదకొచ్చింది కదా… ఎలాగైనా డబ్బులు కడతారని మానవత్వం మంటలో కలిపింది హైదరాబాద్‌లోని నవోదయ ఆసుపత్రి. పైసలకు ఆశపడి వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ఏడేళ్ల హారికకు జ్వరమొచ్చింది. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న తల్లిదండ్రులు… సికింద్రాబాద్‌లోని ఈ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో కాలు పెట్టిన వెంటనే హారికను ఐసీయూ లో చేర్చారు.. టెస్టులన్నారు.. లెక్కలేనన్ని పరీక్షలు రాశారు. డాక్టర్లు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు..తరువాత డెంగ్యూ వచ్చిందని నిర్దారించారు. ఒకటి రెండు రోజులు అలా చేసి.. మూడో రోజు అసలు విషయం చెప్పారు. ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని చెప్పేశారు ఈ వైద్యులు. తరువాత హారిక ప్రాణం మాత్రం దక్కలేదు.. కానీ ఈ విషయం మాత్రం తల్లిదండ్రులు చెప్పలేదు.. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారి హారిక ట్రీట్ మెంట్ మధ్యలోనే తుదిశ్వాస విడిచింది… అయినా వెంటిలేటర్ పెట్టి ఐదు రోజులు ట్రీట్ మెంట్ చేసి వైద్యవృత్తిలో కొత్త చరిత్ర సృష్టించింది. బిజినెస్ ను మూడు కేసులు ఆరు కోట్లు అన్నట్లుగా చూసుకుంటోంది ఆసుపత్రి.
Is there no controlling body for this inhuman exploitation! Anybody takes action atleast now as a corrective step for the brutal treatment of that Corporate hospital? Or law will take its course in a different way for these VIPs?
ReplyDelete