పొద్దున్న లేచించి మొదలు.. నిద్రపోయే వరకూ.. ఫేస్‌బుక్ .. ఫేస్‌బుక్.. ఫేస్‌బుక్.. ఫొటో పెడితే
ఎన్ని లైకులొచ్చాయి.. ఎన్ని కామెంట్లు వచ్చాయి.. అని చూసుకోవడం.. ఎక్కువ లైకులు, కామెంట్లు వస్తే మురిసిపోవడం… అనుకున్న లైకులు, కామెంట్లు రాకపోతే వెంటనే కోపగించుకోవడం ఎక్కువైపోతున్నాయి. ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.. దీంతో సంస్థ షేర్లు అమాంతం పెరుగుతున్నాయి. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్స్ జుకన్‌బర్గ్ పాపులారిటీ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఫేస్‌బుక్ అప్లికేషన్ ప్రారంభించినపుడు జుకన్‌బర్గ్‌కి కూడా తెలుసోలేదో.. ఈ అప్లికేషన్ తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తుందని! గుర్తింపు ఒక్కటే కాదు.. అంతులేని సంపద కూడా తెచ్చిపెడుతోంది కూడా! ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్-10 సంపన్నుల జాబితాలో జుకన్‌బర్గ్ ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా? ఆయన సంపద ఎంతో తెలుసా? వింటే ఆశ్చర్యపోవాల్సిందే! జుకన్‌బర్గ్ ప్రస్తుతం సంపన్నుల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నాడు. ఆయన సందప.. 46.25 బిలియన్ల డాలర్లు. ఇప్పుడు జుకన్‌బర్గ్.. ఒరాకిల్ చైర్మన్‌ను వెనక్కినెట్టాడు. అది ఎలా అంటే.. ఫేస్‌బుక్ షేర్లు.. ఒక్కసారిగా 12 శాతం పెరిగాయట. దీంతో జుకన్‌బర్గ్ ఆస్తి 4.85 బిలియన్ డాలర్లు పెరిగిందట. అలాగే ఒరాకిల్ చైర్మన్ లారీ ఎలిసన్ ఆస్తి కేవలం 2.5బిలియన్ డాలర్లు పెరిగిందట. సో ఒరాకిల్‌ని చైర్మన్‌కి వెనక్కి నెట్టి దూసుకెళ్లాడు జుకన్‌బర్గ్.
కాగా జుకర్ బర్గ్ కు ఇటీవల కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. పాప పుట్టిన తరువాత జుకర్ బర్గ్ కు మరింత కలిసొచ్చిందని అంటున్నారు. మొన్నమొన్నటి వరకు పితృత్వ సెలవులో ఉన్న జుకర్ ఇప్పుడిప్పుడే ఆఫీసుకు వెళ్తున్నారట. సుదీర్ఘ సెలవు తరువాత ఆయన ఆఫీసుకు వెళ్లడం.. షేర్లు విలువ పెరగడంతోవారెవ్వా జుకర్ అంటున్నారు ఫేస్ బుక్ ఉద్యోగులు. అంతకంతకూ ఇలా వినియోగదారులను పెంచుకుంటూనే.. సంపద కూడా పెంచుకుంటున్నాడు. ఇలా అయితే ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో మొదటిస్థానంలో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
No comments:
Post a Comment