ఆన్ స్క్రీన్ వండర్ బాహుబలి కి కొనసాగింపు తీసేందుకు అప్పుడే జక్కన్న అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నాడు.స్టోరీ.. డైలాగ్స్.. ఇలా అన్నీ..అన్నీ.. ఇంతలో
పిడుగులాంటి వార్త బిజ్జల దేవ (నాజర్) మంచం పట్టాడని?ఆ.. సంగతి అంటుంచితే.. మొదటి భాగంలా కాదు ఈ సారి తాను అనుకున్నసమయానికే అంటే నాలుగు నెలల వ్యవధిలోనే సినిమా పూర్తి చేస్తానని ప్రకటించాడు. కానీ.. అదీ కుదిరేలా లేదు. వాస్తవానికి సెప్టెంబర్ నుంచి మహాబలి (బాహుబలి – 2 వర్కింగ్ టైటిల్) రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవుతుందని వెల్లడించినా, ఆఖరికి అదీ సాధ్యం కాలేదు.ఏతావాతా తెలిసొచ్చిందేంటంటే.. నవంబర్ నెలాఖరుకు షూటింగ్ స్టార్ట్ అవుతుందని..అప్పటి నుంచి ఓ ఐదు, ఆరు నెలల పాటు ఏకధాటిగా ఆన్ ద సెట్స్ లో జక్కన్న అండ్ కో పనిచేస్తుందని..
ఆలస్యానికి కారణమిదే..
వాస్తవానికి అనుకున్న సమయానికే సీక్వెల్ పోర్షన్ షూటింగ్ మొదలుకావాల్సి ఉన్నా బాహుబలి పార్ట్ – 1 ఇంటర్నేషనల్ వెర్షన్‌కి ఎక్కువ సమయం కేటాయించడంతో జక్కన్న అండ్ కో డైలమాలో పడింది.బూసాన్ మొదలుకొని పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌పై కన్నేయడం కూడా ఇందుకు మరో కారణం. టైం అంతా ఆయా వేడుకలకు వెళ్లి వచ్చేందుకే సరిపోవడం షూటింగ్ కాస్త అనూహ్య రీతిలో.. పోస్ట్‌పోన్ అయ్యింది.ఇప్పటికే పార్ట్ – 2 షూటింగ్ దాదాపు 40శాతానికి పైగా పూర్తయ్యింది గనుక తక్కువలో తక్కువ సినిమాను ఆర్నెల్లలో పూర్తిచేసినా.. 2016 చివరికి గానీ విడుదల కాదు.దీనికీ ఉన్న అవకాశాలు తక్కువే! ఏదేమైనా 2017లోనే గ్రాండ్‌గా సినిమాను రిలీజ్ చేసి, పార్ట్ – 1 కన్నా పెద్ద హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకధీరుడు.ఈ విషయం తెలిస్తే అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో..? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్నది ఎప్పుడు తెలుసుకుంటారో..? అయ్యో! బాహుబలి.. నువ్వొస్తావని ఆంధ్రావనే కాదు యావత్ ప్రపంచం నిరీక్షిస్తుందయ్యా! రావయ్యా! లేట్ నైట్ పార్టీలు మానుకొని.. కార్పొరేట్ కార్పెట్ల సంగతి అంటుంచి రావయ్యా! టెన్షనెందుకు దండగ.. క్రేన్ వక్క పలుకులు తినవయ్యా!
No comments:
Post a Comment