Thursday, 4 February 2016

మోడీని మించిపోయిన స‌న్నీలియోన్

0485051

ప్ర‌ముఖ పోర్న్‌స్టార్ స‌న్నీలియోన్ కోసం నెటిజ‌న్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. అందానికి అందం – అభినయానికి అభినయం – శృంగారానికి శృంగారం అన్నట్లుగా ఉండే సన్నీకి ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. అయితే… ఆమెకు ఉన్న ఆదరణ ఎంత అన్నదానికి ఇంతవరకు ఎవరికీ కొలమానం తెలియకపోయినా తాజాగా మాత్రం ఆమె పాపులారిటీ ఎంతన్నది పక్కాగా తెలిసింది. 2015 సంవ‌త్స‌రానికి గూగుల్‌లో ఎక్కువ మంది ఇండియ‌న్లు సెర్స్ చేసిన వ్య‌క్తిగా స‌న్నీలియోన్ రికార్డు సృష్టించింది.
స‌న్నీలియోన్ ఈ పోటీలో క‌త్రినా కైఫ్, దీపికా పదుకొనే లాంటి అగ్రతారలను సైతం వెనక్కి నెట్టేసింది. ఈ ఏడాది బాహుబ‌లి, భ‌జ‌రంగీ భాయ్‌జాన్ లాంటి సినిమాలు దేశ‌వ్యాప్తంగా ఎన్నో స‌రికొత్త రికార్డులు సృష్టించాయి. స‌ల్మాన్‌ఖాన్ అయితే భ‌జ‌రంగీ, ప్రేమ్‌ర‌త‌న్ ధ‌న్‌పాయే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో స‌రికొత్త రికార్డు సృష్టించాడు. అయినా స‌న్నీ వీళ్లంద‌రిని వెన‌క్కునెట్టి గూగుల్ సెర్చింగ్ జాబితాలో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. విచిత్రం ఏంటంటే 2013లో కూడా స‌న్నీలియోన్ ఈ జాబితాలో ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది.
ఈ జాబితాలో టాప్‌-10 ప్లేసులో ఉన్న వారి లిస్టు ఇలా ఉంది
1) సన్నీ లియోన్
2) సల్మాన్ ఖాన్
3) ఏపీజే అబ్దుల్ కలాం
4) కత్రినా కైఫ్
5) దీపికా పడుకునే
6) షారూక్ ఖాన్
7) యోయో హనీ సింగ్
8) కాజల్ అగర్వాల్
9) అలియా భట్
10) నరేంద్ర మోడీ
విచిత్రం ఏంటంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి ఈ జాబితాలో ఆలియాభ‌ట్ త‌ర్వాత ప‌దో స్థానం ద‌క్కింది. అంటే ఎంతోమందిని ప్ర‌భావింతం చేస్తున్న మోడీ కంటే కూడా స‌న్నీ గురించి సెర్చ్ చేస్తున్న వారే ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో దేశ‌వ్యాప్తంగా ఉన్న యువ‌త స‌న్నీలియోన్‌తో పాటు ఆమె సినిమాల కోసం గూగుల్‌లో ఏ స్థాయిలో వెతుకుతున్నారో అర్థ‌మ‌వుతోంది.

No comments:

Post a Comment