బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. భారత్‌లో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి , విదేశీయులను
ఆకర్షించడానికి కేంద్ర పర్యాటక శాఖ ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో అతిథి దేవోభవ.. ఇంక్రెడిబుల్ ఇండియా ఒకటి… దీనికి బ్రాండ్ అంబాసిడర్ అమీర్‌ఖాన్. మన దేశంలోకి వచ్చే అతిథులను గౌరవించాలంటూ అమీర్ ఎన్నో టూరిజం యాడ్స్‌లో దేశాన్ని ప్రమోట్ చేశాడు. అయితే ఇక నుంచి అమీర్ ఇన్‌క్రెడిబుల్ ప్రకటనల్లో కనిపించకపోవచ్చు. తాజాగా అమీర్‌ను ఈ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి కేంద్ర పర్యాటక శాఖ అతనిని తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖా మంత్రి మహేష్‌శర్మ మాట్లాడుతూ ఇంక్రెడిబుల్ ఇండియా ప్రచారం కోసం కుదుర్చుకున్న ఒప్పందం ముగిసిందని…ఇక అమీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండరని తెలిపారు.
కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ… తన భార్య కిరణ్ ఇక్కడ ఉంటున్నందుకు భయపడుతున్నట్లు చెప్పిందని, ఆమె తొలిసారి భయపడిందని, భారత్ నుంచి వెళ్లిపోదామా అని తనను అడిగిందని చెప్పాడు. అమీర్ చేసిన ఈ మత అసహనం వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ నేతలు అయితే ఆయన పైన దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత తీవ్ర విమర్శలు చెలరేగిన నేపథ్యంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ… తనకు లేదా తన భార్యకు దేశం విడిచి వెళ్లిపోవాలని లేదని, అలా ఎప్పుడూ అనుకోలేదని, ఇక ముందు కూడా అనుకోమని చెప్పాడు. అయితే వీటిని పట్టించుకోని కేంద్ర పర్యాటక శాఖ అమీర్‌కు షాక్ ఇచ్చింది. ఆయన్ను ఇంక్రెడిబుల్ అంబాసిడర్ పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
please share it..
No comments:
Post a Comment